Monday, May 5, 2025
- Advertisement -

మహేష్ కత్తి వెనుక ఉన్నది ఎవరో..? పవన్‌ని తిట్టిస్తున్నది ఎవరో తెలిసిపోయింది

- Advertisement -

తెలుగు ప్రజలకు ఉన్న సమస్యలన్నింటికంటే ఇప్పుడు మీడియాకు మహేష్ కత్తినే హాట్ ఫేవరైట్…..మహేష్ కత్తి మాత్రం వరుసగా పవన్ పై విమర్శలతో దాడి చేస్తున్నాడు. అసలు ఆ మహేష్ కత్తి వెనుక ఉన్నది ఎవరు? పవన్‌నే ఎందుకు తిట్టిస్తున్నారు? ఈ మొత్తం రాజకీయ చదరంగంలో కంటికి కనిపించకుండా పావలు కదుపుతూ గేం ఆడుతున్నది ఎవరు? ఇప్పుడు ఈ విషయాన్నీ ససాక్ష్యంగా దొరికిపోయి. వాస్తవాలన్నీ కూడా కంటికి కనిపిస్తూ ఉన్నవే.

మహేష్ కత్తి తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నది ఎవరిని? ఇంకెవరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌నే. ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరికి మద్దతుదారు? టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడికి అన్నది నిజం. అలాంటి నేపథ్యంలో జగన్‌కి ప్రత్యర్థి అయిన చంద్రబాబు భజన చేస్తున్న పవన్‌ని మహేష్ కత్తి విమర్శిస్తూ ఉంటే మహేష్ కత్తిని ఎంకరేజ్ చేయాల్సిన మీడియా ఏది? జగన్‌కి మద్ధతునిచ్చే మీడియానే? కానీ వాస్తవంగా మొదటి నుంచీ కూడా మహేష్ కత్తిని ప్రోత్సహిస్తున్నది ……అతనికి పతాక స్థాయిలో ప్రాధాన్యతనిస్తున్నది ఎవరు? చంద్రబాబు భజన మీడియాలో ఉన్న ప్రధాన బృందం. మరి మహేష్ కత్తి వెనుక జగనే కనుక ఉండి ఉంటే…….మహేష్ కత్తి జగన్‌కి మద్ధతుదారు అయితే పచ్చ మీడియా ఎంకరేజ్ చేస్తుందా? ఆ ప్రసక్తేలేదు. మరి పవన్‌ని విమర్శిస్తున్న వాళ్ళను చంద్రబాబు బ్యాచ్ ఎందుకు వెనకేసుకొస్తున్నట్టు?

అదే చంద్రబాబు అసలు సిసలు రాజకీయం. నంద్యాల ఉపఎన్నికల సందర్భంలో పవన్ మద్ధతును కోరలేదు చంద్రబాబు. కానీ పవన్ ఫ్యాన్స్ ఓట్లు మాత్రమే బాబు పార్టీకే పడ్డాయి. ఎందుకు? ఎందుకంటే పవన్‌ని జగన్‌కి శతృవును చేయడంలో బాబు సక్సెస్ అయ్యాడు కాబట్టి. పవన్‌ని పవన్ ఫ్యాన్స్‌ని పూర్తిగా జగన్‌కి శతృవులను చేస్తే చాలు……ఇక ఆ తర్వాత నుంచీ టిడిపికి, తనకు మద్ధతివ్వమని పవన్‌ని అభ్యర్థించాల్సిన పరిస్థితి చంద్రబాబుకు ఎప్పటికీ రాదు. తనకు శతృవు అనే స్థాయిలో జగన్‌ని చూస్తున్న చంద్రబాబు…..ప్రజాబలం, కుల బలం ఉన్నవారందరినీ కూడా జగన్‌కి శతృవులయ్యేలా చేయడంలో ఎప్పటి నుంచో రాజకీయ వ్యూహాలు పన్నుతూనే ఉన్నాడు. ఇప్పుడు పవన్ వర్సెస్ మహేష్ కత్తి ఎపిసోడ్ కూడా అందులో ఒక భాగం అంతే.

అయితే మహేష్ కత్తి దళిత వర్గానికి చెందినవాడు కావడం, దళిత రాజకీయాలను ప్రోత్సహించేవాడు కావడంతో మహేష్ కత్తి జగన్ మనిషి అన్న ముద్రవేయడంలో కూడా పచ్చ గ్యాంగ్ సక్సెస్ అయింది. అలాగే బాబు, కెసీఆర్‌లతో సహా మోడీని కూడా వదలకుండా అధికారంలో ఉన్న అందరినీ ప్రశ్నించడం, విమర్శించడం మహేష్ కత్తి ఆశయం. ప్రజల తరపున పోరాడేవాడు ఎవడైనా అధికార పార్టీలనే విమర్శిస్తాడు? మహేష్ కత్తి కూడా అదే చేస్తాడు. ఆ రకంగా కూడా చూశారా..జగన్‌ని విమర్శించడంలేదు కాబట్టి జగన్ మనిషి అన్న ముద్ర మహేష్ కత్తిపై వేయడం బాబు గ్యాంగ్‌కి చాలా సులభం.

ఒక బాణం …రెండు పిట్టలు లాంటి సిద్ధాంతాలు బాబుకు కొత్త కాదు. తన భజన మీడియా ద్వారా మహేష్ కత్తి వర్సెస్ పవన్ ఇష్యూని ఎంత హైలైట్ చేస్తే బాబుకు అంత లాభం. పవన్ ఫ్యాన్స్‌తోపాటు కాపు కులంలో ఉన్న పవన్ మద్ధతుదారులు కూడా పూర్తిగా జగన్‌కి శతృవులను చెయ్యొచ్చు. ఆ తర్వాత పవన్ మద్ధతు కోరాల్సిన అవసరం కానీ పవన్ అడిగినన్ని సీట్లు ఇవ్వాల్సిన ఆగత్యం కానీ బాబుకు ఉండదు. ఎలాగూ జగన్‌ని శతృవు అనుకునేస్థాయిలో ద్వేషాన్ని పెంచి ఉంటాడు కాబట్టి……..పవన్‌తో పొత్తులు, సీట్ల బేరంలో తేడాలు వచ్చినా పవన్ ఫ్యాన్స్ అందరూ కూడా జగన్‌కి ఓటు వేయలేని స్థితిలో ఉంటారన్నది బాబు నమ్మకం. బాబు రాజకీయ ప్రస్థానాన్ని మొత్తం చాలా దగ్గరగా ఉండి పరిశీలించిన ఒక సీనియర్ మోస్ట్ సంపాదకీయుడు ససాక్ష్యంగా తేల్చిన నిజం ఇది. బాబు రాజకీయ వ్యూహాలు, కుట్రలా………మజాకానా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -