జగన్‌మీద కత్తితో దాడి చేసిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ సంఘటనపై టీడీపీ, వైసీపీల మధ్య రెండు రోజుల నుంచి మాటయుద్ధం కొనసాగుతోంది. ఒక ప్రతిపక్షనేత మీద హత్యాయత్నం జరిగితే కనీసం సానుభూతికూడా లేకుండా పచ్చనేతలు ఇష్టమొచ్చినట్లు కారుకూతలు కూస్తున్నారు. ఒకడుగు ముందుకేసి మేము ప్లాన్ చేస్తే ఏకంగా పైకే పోతారంటూ బాధ్యతాయుతమైన పదువుల్లో ఉన్న నేతలు మాట్లాడటం ఆందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
పచ్చపార్టీ నేతలు మాట్లాడుతున్న మాటలు చూస్తే జగన్‌మీద ఎంత పగ పెంచుకున్నారో అర్థమవుతోంది. ఈ హత్యాయత్నాన్ని కేవలం రాజకీయం కోసం, కేంద్ర ప్రభుత్వంపై దాడికి, ఆపరేషన్ గరుడ అనడానికి.. వాడుకోవడం అలవాటుగా మారింది.
ముందుగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ జగన్ ను హత్య చేయించడానికి స్కెచ్ ఇలా ఉండదని సెలవిచ్చారు. జగన్ ను హత్య చేయించాలని తాము అనుకుంటే.. రాజారెడ్డిని, వైఎస్ రాజశేఖరరెడ్డిని చంపినట్టుగా ప్లాన్ వేసే వాళ్లమని ఈ మంత్రిగారు సెలవివ్వడం విశేషం. తమ ప్లాన్స్ అంత పక్కాగా ఉంటాయని.. జగన్ ఇలా బతికి బయటపడేవాడు కాదని… జగన్ బతికి బయటపడ్డాడు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను చూస్తే ఇది బాబు చేయించన పని కాదని చెప్పుకొచ్చారు.
విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా ఇదే చెబుతున్నాడు. తాము జగన్ ను హత్య చేయించాలనుకుంటే ఆయన ఎప్పుడో కైమా కైమా అయిపోయేవారని బాధ్యతగల ఈ ఎంపీ వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతను హత్య చేయించడంలో తమ సమర్థతను ఈ ఎంపీగారు వివరించారు. తాము అనుకుంటే జగన్ ఎప్పుడో అయిపోయేవాడని కూడా చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే నిజంగానే జగన్ మీద పచ్చనేతలు ఎంత పగపెంచుకున్నారో తెలిసిపోతోంది.