నంద్యాల ఉప ఎన్నిక జోరు మరింత రసవత్తరంగా మారింది. ఇరు పార్టీల హేమాహేమీలు ప్రచారాన్ని వారి వ్యాఖ్యలతో రక్తికట్టిస్తున్నారు. ఒకరిమీద ఒకరు విమర్శలతో దుమ్మెత్తి పోసుకుంటున్నారు.జగన్ నంద్యాలకు వెల్తుండటంతో వైసీపీలో నయా జోష్ కనిపిస్తోంది.తాజాగా బాబుపై వైసీపీ ఎంపీ బుట్టారేణుక చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి.
ముఖ్యయంత్రి చంద్రబాబుకు విలువలు లేని మనిషని, ఆయనకు విలువలంటే లెక్కే లేదని ధ్వజమెత్తారు వైసీపి నేతలు. నంద్యాల ఉప ఎన్నికలను ధర్మానికి అధర్మానికి మద్య జరగుతున్న యుద్ధంగా చిత్రీకరించారు వైసీపి ఎంపీ బుట్టా రేణుకా. ధర్మం వైసీపీ వైపే ఉంది, నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ కార్యాలయంలొ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
చంద్రబాబు అభివృద్ది జపం చేస్తున్నారని బుట్టా రేణుకా ఆరోపించారు, మూడున్నర సంవత్సరాల్లో చేయని అభివృద్ది ఇప్పుడు ఎలా చేస్తారు అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు హామీలు శిలాఫలకాలకే పరిమతమయ్యాయి అని ఆమె విమర్శించారు. రాష్ట్రంలో వృద్దులకు, వితంతువులకు పింఛను అందడం లేదని ఆమె తెలిపారు. యువతకు ఉద్యొగాలు లేకా అల్లాడుతున్నారని, మరోవైపు రైతులు, డ్వాక్రా మహిళలు రుణమాఫీ కాక ఇబ్బందులు పడుతున్నారు అని ఆమె పెర్కొన్నారు. వీటన్నింటిని ఫలితంగా టిడిపీకి ప్రజలు బుద్ది చెబుతారని అన్నారు. వైసీపి తప్పకుండా నంద్యాల్లో గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇప్పటికే ఆగ్రనాయకులందరూ నంద్యాలలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. రేపటినుంచి వైసీపీ అధినేత ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో దిగనున్నారు.ఇక టీడీపీనుంచి బాబుకడా రెండు మూడు రోజుల నంద్యాలలోనె క్యాంపు వేయనున్నారు.ఇక నంద్యాల ఉప ఎన్నిక ప్రచారం మరింత రక్తికట్టడం ఖాయం.