ఒక వైపు నామినేషన్లు…మరో వైపు ఎన్నికల ప్రచారంతో రాజీకాయ పార్టీలు హోరెత్తిస్తున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలతో కాక రేపుతున్నాయి. ప్రధానంగా టీడీపీ, వైసీపీ మధ్యనే మాటల తూటాలు పేలుతున్నాయి. విజయనగరం జిల్లాలో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు బొత్సపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రభుత్వంలో పరిశ్రమలు రాష్ట్రానికి వస్తుంటె కాంగ్రెస్ హయాంలో కొందరి నాయకుల అవినీతి మూలంగా పరిశ్రమలు వెనక్కు వెల్లాయని పరోక్షంగా బొత్సపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబు వ్యాఖ్యలకు బొత్స ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ప్రతీ సారి అవినీతి ఆరోపనలు చేస్తున్న బాబు విచారణకు ఆదేశించి చూడాలని సవాల్ విసిరారు. బాబు మాయమాటలకు ప్రజలు మోసపోవద్దని వ్యాఖ్యానించారు. టీడీపీ హయాంలో చీపురుపల్లి అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. చేసిన ఆరోపణలపై ఎంక్వైరీ వేసి చూస్తే తన నిజాయతీ స్పష్టమవుతుందని బొత్స వ్యాఖ్యానించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి వైసీపీ అభ్యర్ధిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు.
- Advertisement -
చంద్రబాబుకు సవాల్ విసిరిన బొత్ససత్యనారాయణ..
- Advertisement -
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -