Tuesday, May 6, 2025
- Advertisement -

విజయసాయి చెప్పింది నిజమా…? కన్నా గారూ త్వరపడండి లేకుంటె మీ పదవి..?

- Advertisement -

కొద్ది రోజులుగా ఏపీ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా విమర్శలతో దూకుడు పెంచారు. పోలవరం, వరదలు, రాజధాని నిర్మానంపై వరుసగా విమర్శలు చేస్తూ జగన్ ని టార్గెట్ చేస్తున్నారు. కన్నా , బాబు చేస్తున్న వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.

కొంచెం ఆలస్యమైనా కుట్రలు, దోపిడీలు చేసిన వారి పాపం పండుతుందని బాబుపై విమర్శలు చేశారు. చిదంబరం 20 సార్లు ముందస్తు బెయిలుతో అరెస్టు తప్పించుకున్నా చివరకు కటకటాల పాలుకాక తప్పలేదని పేర్కొన్నారు. 18 అవినీతి కేసుల్లో స్టేలు తెచ్చుకున్న చంద్రబాబు పరిస్థితి కూడా అంతేనన్నారు.

గతంలో సోము వీర్రాజును ఏపీ బీజేపీ అధ్యక్షుడు కాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని తెలిపారు. తాజాగా కన్నా లక్ష్మీనారాయణను టార్గెట్ చేశారని… ఆయనను ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి, తన విధేయుడిని ఆ స్థానంలో కూర్చోబెట్టేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. తన సొంత మనుషులు సుజనా చౌదరి, సీఎం రమేష్ ల ద్వారా ఢిల్లీలో లాబీయింగ్ చేయిస్తున్నారని చెప్పారు. ఢిల్లీలో జరగుతున్న పరిణామాలను ఎప్పటి కప్పుడు తమ యజమాని బాబుకు బ్రీప్డ్ చేస్తుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -