స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అత్యంత గొప్ప రాజనీతిజ్ఙుడిగా పేరుగాంచిన వాజ్‌పేయి స్వర్గస్తులయ్యారు. భారతీయులందరూ వాజపేయి సేవలను గుర్తు చేసుకుంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఈ అంశాన్ని కూడా రాజకీయంగా వాడుకుంటూ ఉండడం బాధకలిగిస్తోంది. వాజపేయిని ప్రశింశిస్తున్నారో లేక చంద్రబాబుకు రాజకీయ మైలేజ్ తెచ్చిపెట్టే కార్యక్రమం చేస్తున్నారో తెలియని పరిస్థితి. అలాగే పనిలో పనిగా నరేంద్రమోడీని వాజపేయితో పోల్చుతూ విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు ఎల్లో బ్యాచ్ అందరూ.
మోహన్‌బాబు లాంటి సినిమా స్టార్లు కూడా వీళ్ళకు ఏ మాత్రం తీసిపోవడం లేదు. రాజ్యసభలో తను మాట్లాడిన మాటలకు వాజపేయి మైమరిచిపోయాడు అనే రేంజ్‌లో వాజపేయి గురించి మాట్లాడుతూ తన సొంత డబ్బా కొట్టుకున్నాడు మోహన్ బాబు. ఇక ఎల్లో మీడియా మొత్తం కూడా వాజపేయితో చంద్రబాబు ఉన్న ఫొటోలను ఓ స్థాయిలో ప్రచారం చేస్తోంది. అలాగే అబ్దుల్ కలాంని రాష్ట్రపతిని చేయడం దగ్గర నుంచి కార్గిల్ వరకూ అన్ని గొప్ప విషయాల్లోనూ చంద్రబాబు పాత్ర ఉంది అని ప్రచారం చేయడం మొదలెట్టారు. ఇక చంద్రబాబు కూడా తన స్పీచ్‌లలో వాజపేయి సాధించిన ఘనతలను తన అకౌంట్‌లో వేసుకునే ప్రయత్నం, అలాగే ఎల్లో మీడియా మొత్తం కూడా ఈ విషాదకర సందర్భంలో చంద్రబాబు ఘనతలను చెప్పడానికి, వాజపేయితో పోలుస్తూ నరేంద్రమోడీని విమర్శించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండడం విస్తుగొలుపుతోంది. పచ్చ పార్టీ అభిమానులకు ఎలా ఉన్నా……..తటస్థులకు మాత్రం ఈ వ్యవహారాలు చిరాకు పుట్టిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ లేని గొప్పదనాన్ని చంద్రబాబు ఆపాదించడం అవసరమా అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అబ్దుల్ కలాం రాష్ట్రపతి అవ్వడం వెనకాల చంద్రబాబు కృషి ఉంది అని వాజపేయి ఎప్పుడూ చెప్పలేదు. బాబు వళ్ళే రాష్ట్రపతి అయ్యానని కలాం కూడా ఎప్పుడూ చెప్పలేదు. కానీ బాబు అండ్ కో మాత్రం అవకాశం వచ్చినప్పుడల్లా వాజపేయి సాధించిన ఎన్నో ఘనతలను వాళ్ళ అకౌంట్‌లో వేసుకుంటూ ఉండడం ………….అది కూడా వాజపేయి మరణించిన ఈ సందర్భంలోనూ అలాంటి రాజకీయం చేస్తూ ఉండడంపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.