Sunday, May 4, 2025
- Advertisement -

జగన్ సీఎం కావలని.. ఆ ఎమ్మెల్యే తిరుమలకు పాదయాత్ర

- Advertisement -

ఎవరైన.. ఎవరినైనా అభిమానిస్తే.. వారి కోసం ఎంతైన చేయడానికి రెడీ అవుతారు. అలానే కొంత మంది తాము అభిమానించే వారికోసం కొన్ని కార్యక్రమాలు చేస్తుంటారు. ఇప్పుడు అలానే వైసీపీ ఎమ్మెల్యే.. తమ అధినేతపై ఉన్న అభిమానంతో తిరుపతికి పాదయాత్ర చెయ్యనున్నారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని.. గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తిరుపతికి పాదయాత్ర మొదలు పెట్టారు.

ఈ పాదయాత్రను వైసీపీ అధికార ప్రతినిధి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. 2019లో జరగనున్న ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడం పక్కా అని.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వడం ఖాయమని తెలిపారు. ఈ యాత్రలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు 150 మంది పాల్గొంటారు. రోజుకు 30 కిలోమీటర్ల చొప్పున 13 రోజుల్లో తిరుమలకు చేరుకుంటారు. పాదయాత్రలో కులాలు, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన అన్నారు.

పాదయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కోన రఘుపతి, మహ్మద్‌ ముస్తాఫా, పార్టీ నేతలు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మర్రి రాజశేఖర్, అంబటి రాంబాబుతో పాటు ఇతర జిల్లా నాయకులు హాజరయ్యారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -