వైఎస్ జగన్ బిజెపితో కుమ్మక్కయ్యాడు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలను నమ్మించడానికి నానా తంటాలూ పడుతున్నాడు చంద్రబాబు. ఆ విషయం డైరెక్ట్‌గా చెబితే ప్రజలు ఎవ్వరూ నమ్మడానికి సిద్ధంగా లేరు కాబట్టి పవన్‌ని, జగన్‌ని ఒకే గాటన కట్టేసి మాట్లాడుతున్నాడు. కానీ ప్రజలు మాత్రం అసలు విషయాలను నిజాయితీగా విశ్లేషించి మరోవిధంగా అర్థం చేసుకుంటున్నారు.
ప్రత్యేక హోదా విషయంలో పది రోజుల క్రితం వరకూ చంద్రబాబు ఏం మాటలు చెప్పాడో ఇప్పుడు పవన్ కూడా అవే మాటలు చెప్తున్నాడు. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ పది రోజుల క్రితం వరకూ ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఎన్ని వెకిలి మాటలు మాట్లాడాడో, ఎంత వెటకారం చేశాడో ప్రజలకు ఇంకా గుర్తుంది. అలాగే ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న జగన్ విశ్వసనీయతను దెబ్బతీయడానికి చంద్రబాబు అహర్నిశలూ కష్టపడ్డాడు. అలాంటి చంద్రబాబు ఎన్నికల ఏడాదిలో మాత్రం మరోసారి ప్రత్యేక హోదా నినాదం ఎత్తుకున్నాడు. నాలుగేళ్ళుగా హోదా కోసం పోరాడుతున్న జగన్‌ని హోదా ద్రోహిగా చిత్రీకరించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకోసం పవన్ వ్యాఖ్యలను అడ్డుపెట్టుకుంటున్నాడు.
కానీ అసలు విషయం ఏంటంటే నాలుగేళ్ళుగా హోదా గురించి చంద్రబాబు ఏం మాట్లాడాడో పవన్ కూడా ఇప్పుడు అవే మాటలు మాట్లాడుతున్నాడు. బిజెపితో పొత్తు ఉన్నంత కాలం హోదా వేస్ట్ అని చంద్రబాబు చెప్పాడు. అలానే ప్రజలను నమ్మించాలని చూశాడు. ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ జీవితాలపై దెబ్బకొట్టాడు. పోరాడుతున్న జగన్‌ని ప్రజల దృష్టిలో విలన్ని చేయాలని ప్రయత్నించాడు. ఇప్పుడు సడన్‌గా జ్ఙానోదయమైనట్టుగా నాలుగేళ్ళు జగన్ చెప్తున్న మాటలను కాపీ కొడుతు హోదా పోరాటం అని అంటున్నాడు. ఈ నాలుగేళ్ళలోనే షూటింగ్స్ గ్యాప్‌లో అప్పుడప్పుడూ హోదా అన్న పవన్ మాత్రం ఇప్పుడు సడన్‌గా నాలుక మడతేస్తున్నాడు. నాలుగేళ్ళుగా చంద్రబాబు చెప్తున్న మాటలను తాను అందిపుచ్చుకుంటున్నాడు. పది రోజుల క్రితం వరకూ బాబు సంసారం చేసిన బిజెపితో పవన్‌కి కొత్తగా బంధం కలిసిందేమో తెలియదు మరి. ఏది ఏమైనా ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు, పవన్‌లు ఇద్దరివీ కూడా దొంగనాటకాలే అన్నది నిజం. మాట మార్పిడి వ్యవహారాలే. కానీ జగన్ మాత్రం మొదటి నుంచీ ఒకే మాటకు కట్టుబడి ఉన్నాడు. అలాంటిది చంద్రబాబు మాత్రం తాను పునీతుడిని అన్నట్టుగా …….నాలుగు రోజుల క్రితం వరకూ తాను మాట్లాడినట్టుగా ఇప్పుడు మాట్లాడుతున్న పవన్‌ని విమర్శించడం విచిత్రం. ఇక హోదా కోసం మొదటి నుంచీ పోరాడుతున్న జగన్‌పై విమర్శలు చేయడం మాత్రం అత్యంత జుగుప్సాకరం. ఈ విషయంలో హోదా తీసుకురావాలన్న చిత్తశుద్ధి బాబుకు ఏ కోశానా లేదు. కానీ నాలుగేళ్ళ జగన్ పోరాటాన్ని హైజాక్ చేయాలి…….2019లో హోదా సెంటిమెంట్‌కి పడే ఓట్లన్నింటినీ కొల్లగొట్టాలన్న తాపత్రయం తప్ప. మరి మరోసారి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు అబద్ధాలకే పట్టం కడతారా? పచ్చ మీడియా ప్రచార మాయలో పడి మోసపోతారా?