Wednesday, April 24, 2024
- Advertisement -

వైఎస్ జ‌గ‌న్ చేయించిన సొంత స‌ర్వేలో ఏం తెలింది..

- Advertisement -

ఎన్నిక‌ల ఫ‌లితాల‌కోసం యావ‌త్ ఆంధ్ర ప్ర‌జ‌లంద‌రూ ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. ఫ‌లితాలు రావ‌డానికి చాలా రోజుల స‌మ‌యం ఉండ‌టంతో ఆతృత మ‌రింత పెరుగుతోంది. గెలుపుపై అన్ని పార్టీలు ధీమాగా ఉన్నాయి. అన్ని జాతీయ స‌ర్వేలు వైసీపీనె అధికారంలోకి వ‌స్తుంద‌ని జ‌గ‌నే సీఎం అవుతార‌ని గంటాప‌తంగా చెబుతున్నాయి. ఆ స‌ర్వేలు ఎలా ఉన్నా పోలింగ్ ముగిసిన త‌ర్వాత జ‌గ‌న్ సొంతంగా చేయించుకున్న స‌ర్వే ఫ‌లితాలు ఔట్ అయ్యాయి.

వైసీపీ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా ప్ర‌శాంత్ కిషోర్ ను జ‌గ‌న్ నియ‌మించుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే పీకెనుంచి తెప్పించుకున్న స‌ర్వేలే కాకుండా జ‌గ‌న్‌కు సంబంధించిన సొంత టీమ్ స‌ర్వేలు కూడా ఉన్నాయ‌ని..ఎన్నిక‌లకు ముందు …ఎన్నిక‌ల త‌ర్వాత చేసిన రిపోర్టుల‌ను జ‌గ‌న్ తెప్పించుకున్న‌ట్లు స‌మాచారం.

జ‌గ‌న్ ఎక్కువ‌గా న‌మ్మే స‌ర్వే రిపోర్టుల ప్ర‌కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ 80 పైగా అసెంబ్లీ స్థానాల‌ను క‌చ్చితంగా గెలుస్తార‌ని కొన్ని సీట్ల‌లో ట‌ఫ్ ఫైట్ ఉంటుంద‌ని ఒక స‌ర్వే…. మ‌రికొన్ని స‌ర్వేలు 90కి పైగా సీట్లు క‌న్ఫామ్ అని డిక్లేర్ చేశాయి. జ‌గ‌న్‌కు అందిన ఆరు స‌ర్వేల్లో ఒక స‌ర్వే ఏకంగా వైసీపీ 130 సీట్ల వ‌స్తాయ‌ని అంచానా వేసింది.. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ చేయించిన సొంత స‌ర్వేలో మాత్రం ఆ పార్టీకి 117 నుంచి 120 సీట్లు గెలుపొందుతుంద‌ని, జ‌గ‌న్ ద‌గ్గ‌రుండి త‌న టీమ్‌తో చేయించిన స‌ర్వే క‌నుక ఈ స‌ర్వేపై పార్టీ నాయ‌కుల్లో మ‌రింత న‌మ్మ‌కం పెరుగుతోందంట‌. ఇందులో ఎంత వాస్త‌వం ఉందో గాని సోష‌ల్ మీడియాలో మాత్రం హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -