Wednesday, May 7, 2025
- Advertisement -

వైసీపీలోకి బ‌ల‌మైన నేత‌..

- Advertisement -

వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల ప‌రిస్థితి దారుణంగా త‌యార‌య్యింది. అక్క‌డ వారికి టికెట్లు ద‌క్కే ప‌రిస్థితి క‌నిపించ‌డంలేదు. వారి నియోజ‌క వ‌ర్గాల్లో వారిమీద పూర్తిగా వ్య‌తిరేక‌త ఉండ‌టంతో బాబు వారికి టికెట్లు ఇచ్చే ప‌రిస్థితి లేదు. ఇక వారి నియోజ‌క వ‌ర్గాల్లో వారి స్థానంలో వైసీపీ త‌రుపునుంచి బ‌ల‌మైన అభ్య‌ర్తుల‌ను నిలిపేందుకు జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా ముందుకెల్తున్నారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో జ‌గ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఒక‌రు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ్యోతుల చెక్ పెట్టేందుకు వైసీపీ అధినేత జగన్.. మాష్టర్ ప్లాన్ వేశారు. ఒక వేల త్వరలో ఏపీలో రానున్న ఎన్నికల్లోనూ..జగ్గంపేట నియోజకవర్గ టికెట్ టీడీపీ తరపున జ్యోతులకే దక్కే అవకాశం ఉంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

తమ పార్టీ గుర్తపై గెలిచి.. తర్వాత అధికార పార్టీలోకి జంప్ చేసిన నేతలపై జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఫిరాయింపు నేతలను ఓడించాలనే కసితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే జ్యోతుల నెహ్రూని ఢీకొట్టే వ్యక్తిని పార్టీలోకి చేర్చుకున్నారు.

రాష్ట్రవిభజన జరగకముందు మంత్రిగా వ్యవహరించిన తోట రామస్వామి మనవడు రామస్వామిని వైసీపీలోకి ఆహ్వానించారు. అతనిని జ్యోతులకు పోటీగా వచ్చే ఎన్నికల్లో జగ్గంపేట నియోజకవర్గం నుంచి పోటీకి దింపాలని జగన్ యోచిస్తున్నట్లు సమాచారం. తోట రామస్వామి కిర్లంపూడి మండలానికి చెందిన వ్యక్తి కాగా.. ఆయన తాత రామస్వామికి అక్కడ మంచి పేరు ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -