- Advertisement -
తన చిన్నాన్న, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఈ హత్యలో చంద్రబాబు ప్రమేయం లేకపోతె సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఈ హత్య విషయమై వైఎస్ జగన్ గవర్నర్‌ను కలసి ఫిర్యాదు చేశారు. చంద్రబాబుకు సన్నిహితులుగా ఉన్న డీజీపీ, అడిషనల్ డీజీ వెంకటేశ్వర రావులను ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించాలని జగన్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ బాబుకు వాచ్ డాగ్‌లా పనిచేస్తోందని ధ్వజమెత్తారు. రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించకపోతె హైకోర్టను ఆశ్రయిస్తామని జగన్ వెల్లడించారు. చంద్రబాబుకు రిపోర్టింగ్ చేసే అధికారులతో కేసు విచారణలో తమకు న్యాయం జరగదన్నారు.