నంద్యాల ఉప ఎన్నిక గెలుపుపై వైసీపీ అధినేత జగన్ దృష్టిసారించారు. పార్టీకి ఎటువంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకొనే పనిలో నిమగ్నమయ్యారు. నియేజక వర్గంలో అసమ్మతి ఎదురుకాకుండా ప్రయత్నాలు ప్రారంబించారు.ఉప ఎన్నికల్లో తనకు టిక్కెట్ ఇవ్వలేదని కొంత అసంతృప్తితో ఉన్న రాజగోపాల్ రెడ్డికి వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక పదవి ఇవ్వనున్నారని తెలుస్తోంది.
భూమా నాగిరెడ్డి టిడిపిలో చేరిన తర్వాత రాజగోపాల్ రెడ్డి నంద్యాల ఇంచార్జిగా ఉన్నారు. నాగిరెడ్డి మృతి అనంతరం ఉప ఎన్నికల్లో తనకు టిక్కెట్ వస్తుందని రాజగోపాల్ రెడ్డి భావించారు. కాని టీడీపీ అభ్యర్తి శిల్పి వైసీపీలోకి చేరి టికెట్‌ను దక్కించుకున్నారు గల్లంతయ్యాయి.దీంతో రాజగోపాల్ రెడ్డి అసంతృప్తికి గురయ్యారు.
ఎన్నికల సమయంలో పొరపాట్లు జరగకుండా అసంతృప్తి లేకుండా ఆయనకు పార్టీలో బాధ్యతలు అప్పగించారు. అయినప్పటికీ రాజగోపాల్ రెడ్డి కొంత అసంతృప్తితోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఉప ఎన్నికల్లో మౌనంగా ఉండకుండా లేదా వ్యతిరేకంగా పని చేయకుండా ఉండేందుకు రాజగోపాల్‌కు మొదటి ఎమ్మెల్సీ పదవి ఇవ్వనున్నారని తెలుస్తోంది. నంద్యాల ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ ఎక్కడా నష్టం జరగకుండా ఇరు పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి.
- Advertisement -
అసంతృప్తులను బుజ్టగించె పనిలో వైసీపీ
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -