రాష్ట్రంలో స్కాంల పాలన నడుస్తోందని మండిపడ్డారు మాజీ సీఎం జగన్. టీడీపీ ప్రభుత్వంలో డిస్కంల అప్పులు పెరిగాయన్నారు. రెడ్‌బుక్ పాలనతో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని జగన్ మండిపడ్డారు. స్టేట్‌లో డిస్కంలు దయనీయ స్థితికి వెళ్లాయని… ఏకంగా రూ.89 వేల కోట్ల నష్టాలు వచ్చాయని తెలిపారు. తమ హయాంలో డిస్కంలను నిలబెట్టే ప్రయత్నం చేశామన్నారు .
నా పాదయాత్రలో కష్టాలను చూశా…ఆ కష్టాలను తీర్చేందుకు వైసీపీ ఐదేళ్ల పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. ప్రతి ఇంటికి మంచి చేశామని…వైసీపీ హయంలో పగటిపూటే 9 గంటల పాటు ఫ్రీ కరెంట్ ఇచ్చామని చెప్పారు. కానీ టీడీపీ సర్కారు రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వలేకపోతోందని …ఎక్కడ చూసినా మాఫియా రాజ్యం నడుస్తోందన్నారు.
చంద్రబాబు హయాంలో గ్రామ సచివాలయ వ్యవస్థ అగమ్యగోచరంగా మారిందన్నారు. సూపర్ సిక్స్‌లు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు కనిపించవు. రెడ్‌బుక్ పాలనలో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తుందని… తన కష్టాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు.