జనసేన పార్టీ ఆవిర్భావ బహిరంగ సభలో పవన్ ప్రసంగంతో రాష్ట్రంలో రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. నిన్నటి వరకు టీడీపీకి మద్దతుగా మాట్లాడిన పవన్…ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. అధికారపార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ ప్రసంగం ఆసాంతం బాబు,టీడీపీ ప్రభుత్వాన్నే టార్గెట్ చేశారు. అయితే వైసీపీపై చేసిన విమర్శలు తక్కువే అయినా టీడీపీపై మాత్రం చెలరేగిపోయారు. ఇప్పుడు ఇదే రాజకీయాల్లో హాట్ టాఫిక్‌గా మారింది.
పవన్ తెలుగుదేశం పార్టీతో జత కట్టే అవకాశం ఉందని, ఖచ్చితంగా గుంటూరులో జరిగే సభలో ఇదే విషయాన్ని చెబుతారని ఆశలు పెట్టుకున్న టీడీపీక నిరాశె ఎదురయ్యింది. ఇదంతా ఒక ఎత్తే జగన్‌పై కూడా విమర్శలు చేశారు. పవన్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మాత్రం భగ్గుమంటున్నా వైసీపీ నేతలు మాత్రం ఆచితూచి స్పందిస్తున్నారు.
అయితే పవన్‌ను ఎక్కడా విమర్శించకుండా వైసీపీ నేతలకు జగనే స్వయంగా ఫోన్లు చేసి చెప్పినట్లు తెలుస్తోంది. ప్పుడున్న పరిస్థితుల్లో పవన్‌ను విమర్శించవద్దండి.. సర్వే ప్రకారం పవన్ కళ్యాణ్ పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉంది. ఎలాగో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీపై మండిపడుతున్నారు కాబట్టి ఇక మిగిలింది మనమే. పవన్ మనతో కలిసే అవకాశం కూడా ఉంది. మీరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడి పవన్‌ను దూరం చేయకండి అంటూ గట్టిగానే చెప్పారట.