వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఏపీలో అతి పెద్ద బిగ్ ఫైట్ కానుంది. ఇప్పటినుంచె అన్ని పార్టీలు తమ అస్త్ర,శస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. ప్రధానంగా అధికార పార్టీ టీడీపీ …ప్రతిపక్షపార్టీ వైసీపీల మధ్యే పోటీ ఉండనుంది. ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని బాబు ఇప్పటికె సంకేతాలు ఇవ్వడంతో పార్టీలు ఎన్నికల సమరానికి సిద్దమవుతున్నాయి. మరో వైపు జగన్ కూడా బిగ్ ఫైట్‌కు సిద్దంగా ఉండాలని తన శ్రేణులకు పిలుపు నిచ్చారు. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
నంద్యాల, కాకి నాడ ఎన్నికల్లో టీడీపీ గెలవడంతో బాబు మంచి జోష్‌మీదున్నాడు. ఇదే జోరును వచ్చే ఎన్నికల్లో కొనసాగించాలని తెలుగు తమ్ముళ్లకు పిలుపు నిచ్చారు. మొన్న మంగళగిరిలో టీడీపీ వర్క్‌షాప్ నిర్వహించింది. ఈ వర్క్‌షాప్‌లో వచ్చే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో ఎమ్మేల్యేలు, మంత్రులు, ఇతర ముఖ్యనేతలకు క్లాస్ తీసుకున్నారు బాబు.
వర్క్‌షాప్‌లో ప్రధానంగా మూడు పీపీపీ కొత్త పద్దతుల్లో వెల్లాలని నిర్ణయించారు. పోల్‌మనేజేమెంట్, పొలిటికల్ మేనేజ్‌మెంట్, పబ్లిక్ మేనేజ్ మెంట్ వీటిని వచ్చె ఎన్నికల్లో అమలు చేయాలని బాబు నాయకులకు సూచించారు. వీటితో పాటు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలను ఇంటింటికి వెల్లి వివరించాలని పార్టీ శ్రేణులకు ఉపదేశించారు.
ఇక ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌కూడా నవరత్నాల పథకాలతో ఎన్నికలకు వెల్లేందుకు సిద్దమవుతున్నారు. విజయవాడలో జరిగిని ప్లీనరీలో నవరత్నాల పథకాలను ప్రకటించారు. అధికారంలోకి వైసీపీ వస్తే ఈ పథకాలను అమలు చేస్తామని హీమీ ఇచ్చారు. ఈ పథకాలను ప్రజలల్లోకి తీసుకెల్లేందుకు అన్న వస్తున్నాడు పేరుతో పాదయాత్రను ప్రారంభించనున్నారు. పాదయాత్రలో గడప గడపకు ప్లీనరీలో ప్రకటించిన పథకాలను తీసుకెల్లాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు.
ఇప్పటికె దీనికి సంబందించిన కార్యచరనను ప్రారంభించారు. వైఎస్ఆర్ కుంటుంబంతో పేరుతో అన్ని ప్రాంతాల్లోను కార్యక్రమాలను ప్రారంభించారు.పాదయాత్ర చేసె సమయానికి నవరత్నాల పథకాలను ప్రజలల్లోకి తీసు కెల్లనున్నారు. వైసీపీ, టీడీపీలు తమ దైన శైలిలో ముందుకెల్తున్నారు.
అధికారపార్టీ టీడీపీకె కొన్ని అవకాశాలు మెండుగా ఉంటాయి. అధికారంలోఉన్న పార్టీ కావడంతో ధనబలం, అంగబలం, అధికార బలం అన్నీ అనుకూలంగా ఉంటాయి. అయితే నంద్యాల,కాకి నాడలో పనిచేసిన బాబు మూడు పీలు రాష్ట్రం అంతటా ఫలిస్తాయనుకుంటె అంత అవివేకం ఉండదు. ఏది ఏమైనా ఎలాంటి పథకాలతో ప్రజలల్లోకి వెల్లినా వారిని ఓట్లుగా మలుచుకోవడంలో ఉంది విజయం. మరి బాబు మూడు పీపీపీ లు బాబును గట్టెక్కిస్తాయో, జగన్‌ను నవరత్నాల పథకాలు గట్టెక్కిస్తాయో 2019 వరకు వేచి చూడాల్సిందె.