Sunday, May 4, 2025
- Advertisement -

జయంతికి, వర్ధంతికి మధ్య కూడ లోకేష్‌కు తేడా తెలియదని…వైఎస్ ష‌ర్మిల సెటైర్స్‌

- Advertisement -

చాలా రోజుల త‌ర్వాత వైఎస్ శ‌ర్మిల మీడియాముందుకు వ‌చ్చారు. త్వ‌ర‌లో వైసీపీ త‌రుపున ఎన్నిక‌ల ప్ర‌చారం చేయ‌నున్న ష‌ర్మిల అమ‌రావ‌తితో మీడియాతో మాట్లుడుతూ చంద్ర‌బాబు, లోకేష్‌ల‌పై నిప్పులు చెరిగారు. 2014 ఎన్నిక‌ల్లో బాబు వ‌స్తె జాబు వ‌స్తుంద‌ని చెప్పిన బాబు చివ‌ర‌కు త‌న కొడుక్కు లోకేష్‌కు మూడు ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టార‌ని ఎద్దేవ చేశారు. బాబు వస్తే జాబ్ వస్తోందని టీడీపీ నేతలు ప్రచారం చేశారని ఆమె గుర్తు చేశారు. చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలు పోయాయన్నారు.

తెలంగాణాలో కేటీఆర్‌లాగా ఇక్క‌డ కూడా లోకేష్‌కు ఐటీ మంత్రి ప‌ద‌వి బాబు ఇచ్చుకున్నార‌ని మండి ప‌డ్డారు. కేటీఆర్ హైద‌రాబాద్‌కు ఎన్నో ఐటీ ప‌రిశ్ర‌మ‌లు తీసుకొచ్చార‌ని మ‌రి లోకేష్ ఎందుకు ఐటీ ప‌రిశ్ర‌మ‌ల‌ను తీసుకురాలేదో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ వస్తోందని ఊదరగొడితే తాము ఈ పరిశ్రమను అమరావతిలో ఏర్పాటు చేయడం లేదని ఆ కంపెనీ ప్రకటించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.జయంతికి, వర్ధంతికి మధ్య కూడ లోకేష్‌కు తేడా తెలియదని ఆమె ఎద్దేవా చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -