వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరువాత ఆ పార్టీలో అంతటి చరీష్మా ఉన్నది ఆయన సోదరి వైఎస్ షర్మిలకే అనేది అందరికి తెలిసిన విషయమే. తన తండ్రి చనిపోయిన తరువాత పెట్టిన పార్టీలో జగన్ తరువాత స్థానం ఆమెదే. గతంలో షర్మిల పార్టీని ముందుండి నడిపించారు. జగన్ జైల్లో ఉన్న సమయంలో పార్టీ బాధ్యతలను తన భుజాలపైన మోసింది షర్మిల. పాదయాత్ర చేసి మరి పార్టీని బ్రతికించిన ఘనత ఆమెకే దక్కుతుంది. తరువాత జగన్ జైలు నుంచి రావడంతో షర్మిల పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటుంది.
అయితే ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పార్టీలో షర్మిల గురించి విపరీతమైన చర్చ నడుస్తుంది. షర్మిలను పార్టీ వ్యవహారాల్లో తీసుకువస్తే బాగుంటుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ విషయంలో జగన్ ఆలోచన వేరేలా ఉంది. ఇప్పటికే విజయమ్మను ఎంపీగా నిలబెట్టి పరువు పొగొట్టుకున్నాము. ఇటువంటి సమయంలో షర్మిలను ఎన్నికలలోకి దించే సాహసం చేయడం లేదట జగన్. అయితే కడప ఎంపీగా షర్మిలను రంగంలోకి దించితే చాలా బాగుంటుందని పార్టీ నాయకులు జగన్‌పై ఒత్తిడి చేస్తున్నారట. పార్లమెంట్‌లో పార్టీ తరుపున గట్టిగా మాట్లాడే నేతలు ఎవరు లేరు, అందుచేతనే షర్మిలను పార్లమెంట్‌కు పంపిస్తే కవితలా మన రాష్ట్రం గురించి గట్టిగా పోరాడగలరని ఆశిస్తున్నారు పార్టీ నాయకులు.
షర్మిల పోటీ చేయడంపై లండన్ నుంచి వచ్చిన తరువాత జగన్ నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. షర్మిల ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేస్తుందన్న సమాచారంతోనే ఆమెపై టీడీపీ పార్టీ అసభ్యకర పోస్టింగ్‌లు పెడుతుందని వైసీపీ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికి షర్మిల ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని చాలామంది ఆశిస్తున్నారు. ఆమె పోటీ చేస్తే పార్టీకి లాభాం చేకురుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.మరి జగనన్న బాణం మనస్సలో ఏముందో తెలియాల్సి ఉంది. గత ఎన్నికల మాదిరిగానే అభ్యర్థుల తరుపున ప్రచారం చేసి ఊరుకుంటారో లేక ప్రతక్ష ఎన్నిక రంగంలోకి దిగుతారో చూడాలి అంటే మరో నెల రోజులు ఆగక తప్పదు.