- Advertisement -
గిరిజన తండా బోర్డు ఏర్పాటు చేయాలని, ఎస్టీలకు సంబంధించిన భాష అభివృద్ధికి తోడ్పాటు అందించాలని గిరిజన శక్తి నాయకులు వైఎస్ షర్మిలను కలిశారు. ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ హయాంలో పోడు భూములు ఇచ్చారని.. టి.ఆర్.ఎస్ ప్రభుత్వంలో అవి అమలుకు నోచుకోలేదని ఆందోళన వ్యక్తంచేశారు.
గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని వారు కోరారు. గిరిజనుల పోరాటానికి తన మద్దతు ఉంటుందని వైఎస్ షర్మిల హామీ ఇచ్చారు. గిరిజన శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు డా.ఎం.వెంకటేశ్ చౌహాన్, జాతీయ అధ్యక్షుడు ధరావత్ రాజేశ్ నాయక్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.శరత్ నాయక్ తదితరులు షర్మిలను కలిశారు.
బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి!
భారతీయ సింహం.. తిరిగి రింగ్‌లోకి..!
ఓటీటీ లో విడుదల చెయ్యడం వలన భారీగా నష్టపోయిన దృశ్యం 2…!