రాయలసీమలో అనంతపురానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎన్ని సమీకరణాలు మారిన అక్కడ టీడీపీ జెండాకు తిరుగులేదు. జిల్లా టీడీపీకి కంచుకోట. వైఎస్ఆర్ హయాంలోనే 7 సీట్లు వచ్చాయంటె పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అందుకే అనంమీద జగన్ పూర్తి దృష్టి సారించారు. అక్కడ పట్టు సాధిస్తె జగన్‌కు తిరుగుండదు.
2014 ఎన్నికల్లో వైసీపీ కేవలం రెండు సీట్లు మాత్ర గెలుచుకుంది. దీన్ని బట్టి చూస్తే అక్కడ టీడీపీ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక వేల పాదయాత్ర వల్ల పరిస్థి మారిందనుకున్నా పూర్తి ఆధిపత్యం మాత్రం కనబరచలేదు. రాయలసీమలో తమకు అనంతను అనుకూలంగా మార్చుకుంటే సగం విజయం సాధించినట్లే అని వైయస్ జగన్ గారు బావిస్తున్నారు. అందుకే ఇప్పుడు జగన్ కొత్త ఫార్ములాను ఉపయోగిస్తున్నారు.
అనంతపురంలోకి పాదయాత్ర ఎంటరవకముందే అక్కడి రాజకీయ పరిస్థితులపై అనంత వెంకట్రామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారితో జగన్ చర్చించినట్లు సమాచారం. అందుకే పాదయాత్రకు సంబంధించి అక్కడ ఎక్కువ రోజులు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారనే వినికిడి. జిల్లాలో జేసీ బ్రదర్స్‌కి మంచి పట్టు ఉంది. వారు వైసీపీలో వస్తామన్నా వారి నోటిదురుసు కారనంగా జగన్ వద్దంటున్నారు.
పాదయాత్రకు కొన్ని రోజుల ముందు మేము YCP లోకి వస్తామని, TDP లో మాకు సరైన ప్రాధాన్యత లేదని జేసీ జగన్‌కు చెప్పమని వైకాపా ముఖ్యనేతతో రాయభారం చేశారట. విషయం విన్న జగన్ పార్టీలోకి తీసుకోవడానికి సుముఖత వ్యక్తం చేశారట. అయితే జగన్ ఆలోచన వేరుగా ఉంది. జేసీ కొడుకైన పవన్‌ను పార్టీలోకి తీసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదని, వీలైతే ఎంఎల్ఏ లేదా ఎంపీ సీటు ఇస్తామని చెప్పినట్లు సమాచారం. అదే జరిగితే అనంతలో YSRCP పూర్తి ఆధిక్యత కనబరచకపోయినా గట్టి పోటీని ఇచ్చి కనీసం 6-7 సీట్లను గెలుచుకోవచ్చు.
జగన్ ప్రతిపానకు జేసీ బ్రదర్స్ కూడా ఒప్పుకోవచ్చు. ఎందు కంటె ఇచ్చే ఎన్నికల్లో తాను రాజకీయాలనుంచి తప్పకొని తన స్థానంలో కొడుకును పోటీగా నిలబెడతానని జేసీ ఇప్పటికే ప్రకటించారు. కాని రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. అదే జరిగితె జగన్‌కు పెద్ద ప్లస్.