Monday, May 5, 2025
- Advertisement -

బాబుని చూసి నేర్చుకొ…చెప్పిందెవ‌రో తెలిస్తే షాక్ అవుతారు….

- Advertisement -

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిపై సొంత‌పార్టీ నేత‌ల‌నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తూనె ఉంటాయి. ఎవ‌రిమాట లెక్క‌చేయ‌ర‌ని, మూర్ఖంగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని ఆయ‌న స్నేహితులే అంటుంటారు. ఇప్పుడున్న రాజ‌కీయ అనుభ‌వం స‌రిపోద‌ని జ‌గ‌న్ త‌న వ్య‌వ‌హార‌శైలి మార్చుకోవాల‌ని ….ప్ర‌ధానంగా చంద్రబాబును చూసి చాలా విషయాలు నేర్చుకోవాలని సూచిస్తున్నారు స‌న్నిహితులు.

ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ ఈ స్థాయిలో ఉందంటె జ‌గ‌న్ వ‌ల్ల కాద‌ని …ముమ్మాటికీ వై.ఎస్. చరిష్మా వల్లే అనేది అంద‌రికి తెలిసిందే. వైఎస్ ఆర్ చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని కాంగ్రెస్ పక్కనపెట్టడం, ఆ కుటుంబంపై నేతల్లో, ప్రజల్లో సానుభూతి వెల్లువెత్తడంతో జగన్ నిలదొక్కుకోగలిగారు. కాని ప్ర‌తీ సారి సానుభూతి ఉండ‌దు. కొన్ని రోజుల‌కు అదికూడా త‌గ్గిపోతుంది. కాని ఇప్పుడు పార్టీ నిల‌బ‌డాలంటె జగన్ స్టామినా మీదే ఆధారపడి ఉంద‌నేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే.

పార్టీ మనుగడ, నిర్మాణతీరుపై వైసీపీలో సీనియర్ నేతలు పెదవి విరుస్తున్నారు. ప్రశాంత్ కిశోర్ సూచనతో తాజాగా చేపట్టిన ఇంటింటికీ వైసీపీ, మిస్డ్ కాల్ లకు మంచి స్పంద వ‌స్తున్నా పార్టీ కేడర్ డెవలప్ కావడంలేదని, పేపర్లకే పరిమితమవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పలువురు వైసీపీ సీనియర్లు.

ప్రశాంత్ కిశోర్ కూడా ఇదే విషయాన్ని ఎత్తిచూపినట్టు తెలుస్తోంది. బూత్ లెవల్ నుంచి పార్టీ బలోపేతం చేయకుండా ఇలాంటి మిస్డ్ కాల్స్ ఎన్ని వచ్చినా ఉపయోగం ఉండదని.. పార్టీతో అనుబంధాన్ని పెంపొందించినప్పుడే ఓటర్లుగా మారుతారని వారు చెప్తున్నారు. కేడర్ ను డెవలప్ చేసుకోవడంలో టీడీపీ నుంచి చాలా నేర్చుకోవాలని జగన్ కు ఆయన సన్నిహితులు సూచిస్తున్నారు.

రెండు సార్లు ప్ర‌తిప‌క్షంలో ఉన్నా, రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత‌కూడా రాష్ట్రంలో టీడీపీ నిల‌బ‌డగ‌లిగిందంటె అది పార్టీ క్యాడ‌ర్ నిర్మాన‌మే ప్ర‌ధాన కార‌ణం. చంద్రబాబు దృఢచిత్తం, వ్యూహాలు ఆ పార్టీని అన్నివేళలా, అన్నివిధాలా తట్టుకునేలా చేస్తున్నాయన్నారు. పార్టీ నిర్మాణంలో చంద్రబాబును చూసి చాలా నేర్చుకోవాలని జగన్ కు సూచిస్తున్నారు.

అయితె జ‌గ‌న్ ఇప్పుడు రూట్‌ను మార్చిన‌ట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్ల సూచనలను పరిగణనలోకి తీసుకున్న జగన్.. పార్టీ నిర్మాణం బాధ్యతను ప్రశాంత్ కిశోర్ కు అప్పగించినట్టు తెలుస్తోంది. పార్టీ పరిస్థితిపై అధ్యయనం చేసిన పీకే.. మొదట చంద్రబాబును విమర్శించడం మానేసి .. ఆయన వ్యూహాలపై అధ్యయనం చేస్తే మంచిదని చెప్పారట. ఇప్పుడు వైసీపీ కోర్ టీం ఆ పనిలో నిమగ్నమైందని సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -