నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ దగ్గర పడుతుండటంతో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార పార్టీ నేతలపై వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా మరో సారి విరుచుకు పడ్డారు. ఉప ఎన్నికలో పవన్ తటస్థంగా ఉండటంపై రోజా పవన్‌పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. పనిలో పనిగా బాబును కూడా దుమ్మెత్తి పోశారు.
నంద్యాలలో టీడీపీ ఓడిపోతుందని తెలిసే పవన్ ఆ అవమానం తన ఖాతాలో పడకుండా ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉన్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఇక చంద్రబాబును కూడా దుమ్ముదులిపారు. ఎన్టీఆర్ కే వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు అని ఆమె వ్యాఖ్యానించారు.ఎన్టీఆర్ అర చేతిల్లోంచి పార్టీనీ లాక్కున్న ఘనుడు చంద్రబాబు అని అన్నారు.
బాబు రాయలసీమ ద్రోహి … అయిన చంద్రబాబుకు బుద్ధి చెప్పే అవకాశం రావడం నంద్యాల ప్రజల అదృష్టం. సీమకు రావాల్సిన ఎయిమ్స్‌ను మంగళగిరికి తరలించారు. ఇక ఆయన సొంత జిల్లా అయిన చిత్తూరులో వైఎస్ రాజశేఖరరెడ్డికి పేరు వస్తుందని మన్నవరం ప్రాజెక్ట్‌కు నిధులు అందకుండా చేశారు.
చంద్రబాబు పాలనా తీరును ప్రజలు గమనిస్తున్నారని రోజా అన్నారు. కుట్రలకు 100శాతం పేటెంట్ రైట్ చంద్రబాబుదేనని, ఎన్నికలను ఆపడానికే చంద్రబాబు వస్తున్నారని అన్నారు. నంద్యాలలో తెగించడానికి టీడీపీ సిద్దమైందని, నంద్యాల ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని రోజా అన్నారు.