రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఏపీలో రాజకీయం వేడెక్కింది. ప్రతిపక్షపార్టీనుంచి ఎమ్మెల్యే కొనుగోలుకు అధికారపార్టీ టీడీపీ తెరలేపింది. పార్టీలకున్న బలాల ప్రకారం టీడీపీకి2, వైసీపీకి 1 సీటు దక్కనుంది. కాని ఆసీటునుకూడా దక్కకుండా చేసేందుకు పచ్చపార్టీ బరితెగించి ఎమ్మెల్యేక కొనుగోలుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.
వైసిపి ఎంఎల్ఏలకు ఏకంగా మంత్రులే ఫోన్లు చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది. తమ ఎంఎల్ఏలతో మంత్రులు మాట్లాడిన ఫోన్ సంభాషణల ఆడియో టేపులు తమ వద్ద ఉన్నాయని వైసిపి చెప్పటంతో రెండు పార్టీల్లో ఒక్కసారిగా కాకపుట్టింది.
ఈనెల 23వ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరుగునున్నాయి. వైసీపీకి దక్కనున్న ఒక్క రాజ్యసభసీటును దక్కకుండా చేసేందుకు పలువురు వైసిపి ఎంఎల్ఏలకు మంత్రులు ఫోన్లు చేసి ప్రలోభాలకు గురిచేస్తున్నారని వైసిపి ఆరోపిస్తోంది. వైసీపీ సమాచారం ప్రకారం విజయనగరం జిల్లాలోని సాలూరు ఎంఎల్ఏ పీడిక రాజన్నదొరతో ఓ ఫిరాయింపు మంత్రి మాట్లాడారట. టిడిపిలోకి రావల్సిందిగా కోరారట. టిడిపిలోకి రావటం వల్ల వచ్చే ఉపయోగాలను కూడా వివరించారట. అయితే, మంత్రితో మాట్లాడిన రాజన్నదొర అదే విషయాన్ని వైసిపి నేతలకు చేరవేశారట. దాంతో ఎంఎల్ఏ-మంత్రికి మధ్య జరిగిన ఫోన్ సంభాషణల ఆడియో టేపులను వైసిపి తీసిపెట్టుకుందట.
అదే విదంగా ఉత్తరాంధ్రకు చెందిన మరో మంత్రితో పాటు కోస్తా జిల్లాలకు చెందిన మంత్రి కూడా గుంటూరు వైసిపి ఎంఎల్ఏతో మాట్లాడారట. మొత్తం మీద ఎన్నికల తేదీ దగ్గరకు వచ్చేకొద్దీ ప్రలోభాల పర్వం ఊపందుకుంటోంది. మరి టిడిపి, వైసిపిల్లో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.