Monday, May 5, 2025
- Advertisement -

కర్నూల్ లో వైసీపీకి షాక్.. టీడీపీ కి ప్లస్..?

- Advertisement -

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేని టైం చూసి.. పార్టీ మారే పనిలో పడ్డారు నాయకులూ కార్యకర్తలు.. నంద్యాల ఓటమితో అలానే కాకినాడ ఎఫెక్ట్ తో వైసీపీ నాయకులు భయాందోళన చేందుతున్నారు. అయితే కర్నూల్ జిల్లాకు చేందిన వైసీపీ నాయకులు చాలామంది టీడీపీలోకి జంప్ అవుతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళడం.. వీరికి కలిసివచ్చే విషయం. ఇక వైసీపీలో కొనసాగడం వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదని.. వారు గ్రహించినట్లుగా సమాచారం. దీంతో అధినేత లేని సమయం చూసి.. పార్టీ మారిపోయే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక జగన్ లండన్ నుంచి తిరిగి వచ్చేసరికి చాలా మంది పార్టీలో నుండి చాల మంది వెళ్ళిపోతారు అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

అయితే కర్నూల్ జిల్లాలో పార్టీ మారే నాయకులు అధికంగా కనిపిస్తున్నారు. మరి ఈ విషయం జగన్ కి తెలుసో లేదో తెలియదు కానీ.. ఒకవేళ పార్టీ మారితే.. జగన్ లండన్ నుంచి వచ్చాక ఏం చేస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -