చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణలేకుండా పోయిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు. గురువారం చోడవరంలో జరిగిన వైఎస్సార్ సీపీ మహిళ గర్జనలో ఆమె పాల్గొన్నా రోజా ఈవ్యాఖ్యలు చేశారు. ఆడవాళ్ల మానప్రాణాలతో చెలగాటమాడిన ఆయనకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఎన్నికల వేల పుసుపు-కుంకమ పేరుతో నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ప్రజాసంకల్పయాత్రలో మహిళల కష్టాలు తెలుసుకున్న జగన్.. నవరత్నాలను రూపొందించారన్నారు. జగన్ సీఎం అయితే అన్ని వర్గాల వారికి రక్షణ ఉంటుందని తెలిపారు. మహిళా అధికారిపై ఎమ్మెల్యే దాడి చేసినా బాబు చర్యతీసుకోలేదని…చంద్రబాబును అన్న అని కాకుండా సున్నా అని పిలవాలని రోజా సూచించారు. చీరలు ఇస్తే ఓటు వేస్తారనే భ్రమలో ఉన్న చంద్రబాబుని మహిళలు చిత్తుగా ఓడించాలని ఎమ్మెల్యే రోజా పిలుపునిచ్చారు. మహిళలకు కుటీర పరిశ్రమలు ఇవ్వకపోగా తన కోడలు బ్రహ్మణీకి మాత్రం హెరిటేజ్ కంపెనీ ఇచ్చారని ఆమె విమర్శించారు. జగన్ అమరావతిలో అడుగు పెట్టగానే రైల్వేజోన్ వచ్చిందని…రాష్ట్రంనుంచి సీఎంను వెళ్లగొడితే ప్రత్యేకహోదా వస్తుందని తెలిపారు. ఏపీ మంత్రి నారా లోకేశ్ ఎందుకూ పనికిరాని గన్నేరు పప్పు అని సెటైర్ వేశారు. మహిళలకు పోస్ట్ డేటెడ్ చెక్‌లు ఇవ్వాలన్న ఆలోచన అవుట్ డేటెడ్ చంద్రబాబుదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
- Advertisement -
లోకేష్ పనికిరాని గన్నేరు పప్పు…
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -