చంద్రబాబు నాయుడిని విమర్శించడంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్టైలే వేరు. ఎన్నికలు సమీపిస్తున్న తన విమర్శల దాడిని పెంచారు. ట్విట్టర్లో బాబుకు నిద్రలేకుండా చేస్తున్నా విజయసాయి పార్లమెంట్ సమావేశాల నేపద్యంలో బాబుపై మరో సారి విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ సారి బాబుకు కొత్త పేరు పెట్టారు.
పవన్ తో పొత్తు పెట్టుకుంటే జగన్‌కు వచ్చిన ఇబ్బంది ఏమని బాబు చేసిన వ్యాఖ్యలపై విజయసాయి స్పందించారు. మరో సారి పవన్‌తో పొత్తుకు వెంపర్లాడుతున్నారని…ఇకపై ఆయనను నారా పవన్ రాహుల్ నాయుడు అని పిలుచుకుంటే సరిగ్గా సరిపోతుందని సెటైర్ వేశారు.
గతంలో పవన్ ను ఓ మారు పెళ్లి చేసుకుని, ఆపై విడాకులు ఇచ్చి ఇప్పుడు…మరో సారి పెళ్లి చేసుకొనేందుకు రెడీ అవుతున్నారని ఎద్దేవ చేశారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి ధర్నా నిర్వహించారు.
ఏపీ హైకోర్టు భవనాల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. హదరాబాద్ను తానే నిర్మించానన్న బాబు ఏపీలో ఒక హైకోర్టు భవనం కూడా కట్టలేకపోయారని విమర్శించారు. హైకోర్టును హైదరాబాద్ నుంచి అమరావతికి తీసుకురావడం చంద్రబాబుకు ఇష్టం లేదని తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన 600 హామీల్లో ఏ ఒక్కటి సరిగా అమలు కాలేదని విమర్శించారు. శంకుస్థాపనలతో చంద్రబాబు జనాలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు తగిన విధంగా బుద్ది చెబుతారని హెచ్చరించారు.