గుంటూరు జిల్లా కొండవీడు రైతు కోటయ్య మృతి ఘటనపై టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. కోటయ్య మృతిపై జగన్ మీద మంత్రిలోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శవం మీద జగన్ పేలాలు ఏరుకుంటున్నారని ఆరోపించారు. లోకేష్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఘాటు కౌంటర్ ఇచ్చారు. మేం శవాల మీద పేలాలు ఏరుకుంటున్నామని లోకేష్ విమర్శిస్తున్నారు. ఇంతకీ శవం ఎవరు? నువ్వా? మీ నాన్నా?’ అంటూ ఘాటుగా ప్రశ్నించారు. సీఎం హెలీపాడ్ కోసం రైతు కోటయ్యను పోలీసులే కొట్టి చంపారని వారిపై కేసు నమోదు చేయాలన్నారు. మృతుడు పిట్టల కోటయ్య కుటుంబానికి రూ.50 లక్షల నష్ట పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై కేంద్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేయాలి. సిఎం, డిజిపిలను బాధ్యులుగా చేసి దర్యాప్తుకు ఆదేశించాలి.
- Advertisement -
శవం నువ్వా..? మీనాన్నా…? లోకేష్‌పై విజయసాయి సెటైర్లు
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -