ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైఎస్సార్‌సీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందాయి. రాజీనామాలపై ఈ రోజు ఎంపీలు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కలిసి తమ రాజీనామాలను ఆమోదించాలని కోరారు.రాజీనామాలపై మరోసారి ఆలోచించమని లోక్‌సభ స్పీకర్ కోరగా ,మేము ఆంధ్రప్రదేశకు ప్రత్యేక హోదా కోసం తమ పదవులకు రాజీనామా చేస్తున్నామని, మా రాజీనామాలను ఆమోదించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు విజ్ఞప్తి చేశారు.దీనిపై ఆమె సానుకులంగా స్పందించినట్లు సమాచారం.
ఈ రోజు ఉదయం 11 గంటలకు వైఎస్సార్‌సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డిలు లోక్‌సభ స్పీకర్‌ను కలిసి ఏపీలో ప్రస్తుత పరిస్థితిని వివరించారు.. రాజీనామాల ఆమోదంపై నేటి సాయంత్రం అధికారికంగా ప్రకటన విడుదలయ్యే అవకాశాలున్నాయి.