నంద్యాల ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. అధికార,ప్రతిపక్షాల వ్యూహాలు,ప్రతి వ్యూహాలతో రణరంగాన్ని తలపిస్తోంది. ప్రచారానికి గడువు ముగుస్తుండటంతో మరింత జోరు పెంచారు ఇరు పార్టీలు.వైసీపీ అధినేత జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతుంటె… అధికార పార్టీ కూడా విస్త్రుతంగా ప్రచారం నిర్వహిస్తోంది.
ఉప ఎన్నికను ప్రతీష్టాత్మకంగా తీసుకున్న రెండు పార్టీలు టీడీపీ 12 మంది మంత్రులు, 24 మంది ఎమ్మెల్యేలను రంగంలోకి దింపగా వైసీపీ తరుపున జగన్ ఒక్కడే ప్రచారబాధ్యతలు మోస్తున్నారు. అందుకే టీడీపీకి చెక్ పెట్టేందుకు మరో నాయకున్ని రంగంలోకి దించింది వైసీపీ.
నంద్యాల నియేజకవర్గంలో గోస్పాడు మండలం అత్యంత కీలకమైనది. గెలుపోటములను నిర్దేశించేది ఆమండలమే.అందుకే ఉ మండలం పైన రెండు పార్టీలూ తీవ్రంగా దృష్టి పెట్టారు.దాదాపు ఇరవై ఎనిమిది వేల ఓట్లు పైన ఉండగా ఈ మండలం ఓటర్లని మచ్చిక చేసుకోవడం కోసం రెండు పార్టీలూ చాలా కష్టపడుతున్నాయి. ఈ ప్రాంతం లో అత్యధిక ఓటర్లు టీడీపీ కి వ్యతిరేకంగా కనిపిస్తూ ఉండడం విశేషం.
అదే టైం లో వైకాపా చాలా తెలివిగా వైకాపా సీనియర్ నాయకుడు, ప్రకాశం జిల్లా పార్టీ ప్రెసిడెంట్ బాలినేని శ్రీనివాస రెడ్డి ని రంగంలోకి దించింది. ప్రచారం రానున్న సోమవారం ముగుస్తుంది ఇలోగా నాలుగు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన ఆయనకు మంచి పేరుంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉండటంతో బాలినేని తో స్పెషల్ ప్రచారం చేయిస్తున్నారు వైసీపీ.