కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాం అన్ని అంశం ఇప్పుడు రాజకీయ పార్టీలను కుదిపేస్తోంది. దానిపై జగన్ చేసిన వ్యాఖ్యలకు పవన్ స్పందించారు. జగన్ దమ్మూధైర్యం ఉన్న వ్యక్తి అని పవన్ అన్నారు. అయితే పార్లమెంటు సమావేశాల తొలి రోజునే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టాలని పవన్ అన్నారు. పవన్ చేసిన సవాల్‌ను వైసీపీ స్వీకరించింది. కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడానికి డేట్ ఫిక్స్ చేసింది.
మార్చి 21వ తేదీన భారత పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడుతుందని ఆ పార్టీ ప్రకటించింది. రాష్ట్ర ప్రయోజనాలపై చిత్తశుద్ధి ఉంటే కేంద్రం పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టాలి అని జనసేన అధిపతి పవన్ కల్యాణ్ సవాల్ చేయడం, ఆ వెంటనే వైకాపా సై అని అనడం తెలిసిన సంగతే.
అవిశ్వాస తీర్మానం విషయంలో పవన్ కల్యాణ్.. ఢిల్లీ వెళ్లి ఇతర పార్టీలను ఒప్పించడం సంగతెలా ఉన్నా, ముందుగా.. తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఒప్పించాలని వైకాపా సవాల్ విసిరింది. గత ఎన్నికల ముందు పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీ తరఫున తిరిగి, ఆ పార్టీ తరఫున ప్రచారం చేశారు కాబట్టి. ఇప్పుడు బాబును ఒప్పించి పవన్ కల్యాణ్ తన సత్తాను నిరూపించుకోవాలని వైకాపా అంటోంది.
అందుకు మార్చి 21 వరకూ సమయం ఉందని.. ఆ రోజుకు అయినా చంద్రబాబును పవన్ కల్యాణ్ ఒప్పించాలని వైకాపా అంటోంది. ఇక ఈ అంశంపై పవన్ స్పందిస్తారా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.