Monday, May 5, 2025
- Advertisement -

ప్రత్యేక హోదా: బాబు చెప్తున్నట్టుగా పాపం మొత్తం మోడీదేనా…?

- Advertisement -

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే వేరే ఏ నాయకుడికీ సాధ్యం కాని స్థాయిలో ప్రజాదరణ దక్కించుకున్నాడు వైఎస్ జగన్. వైఎస్ పాలనను మెచ్చిన జనాలతో పాటు …ఇతర ప్రజలను కూడా తన వాగ్ధాటి, నాయకత్వ లక్షణాలతో మెప్పించగలిగాడు. అలాంటి ప్రజాదరణను ప్రజాదరణతో ఎదుర్కోవడం సోనియా, చంద్రబాబులకు సాధ్యం కాలేదు అన్నది నిజం. అందుకే ఇద్దరూ కలిసి జగన్‌పై రాజకీయ కక్ష్యలతో కేసుల డ్రామా నడిపించారు. సోనియానే జగన్‌పై కేసులు పెట్టించింది. సోనియాను ఎదిరించినందుకే జగన్‌పై కేసులు అని చంద్రబాబే స్వయంగా ఒప్పుకున్నాడు. ఇక చీకట్లో చిదంబరంతో చంద్రబాబు మీటింగ్ గురించి కూడా చిదంబరం స్వయంగా పార్లమెంట్‌లోనే చెప్పుకొచ్చాడు. అన్నింటికీ మించి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోనియాతో చంద్రబాబు చీకటి బంధం గురించి అందరికీ తెలిసిన విషయమే. జగన్ ప్రజాబలాన్ని నిజాయితీగా ఎదుర్కోవడం చేతకాని చంద్రబాబు, సోనియాలు కలిసి జగన్‌ని కేసుల పేరుతో వేధించారు అన్న నిజాన్ని చంద్రబాబుతో సహా టిడిపి నేతలు, టిడిపి మీడియా, జాతీయ స్థాయి మీడియా కూడా ఇప్పటికే ఎన్నోసార్లు ఒప్పుకుంది. ఇక జగన్‌పై ఉన్న కేసుల పేరు చెప్పి ఇప్పటికే చాలా ఎన్నికల్లో ప్రజలను ప్రభావితం చేశాడు చంద్రబాబు. 2014 ఎన్నికల్లో కూడా బాబుకు ఉపయోగపడిన ఒక అంశం జగన్ కేసుల ప్రస్తావనే.

ఇప్పుడు ప్రత్యేక హోదాతో సహా నాలుగేళ్ళుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన చంద్రబాబు…. అందుకు బాధ్యులుగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చిన నేపథ్యంలో మరోసారి ఎ1, ఎ2అంటూ, ఆర్థిక నేరగాడు అంటూ అరిగిపోయిన రికార్డుని మళ్ళీ మళ్ళీ వినిపిస్తున్నాడు. ఆ విషయం తప్ప జగన్, విజయసాయిలను విమర్శించడానికి చంద్రబాబు దగ్గర మరో అంశం లేదు మరి. అయితే తాజాగా జాతీయ స్థాయి మీడియా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో విస్తృతంగా ఒక సర్వే నిర్వహించింది. ప్రత్యేక హోదా పాపంలో ఎ1, ఎ2, ఎ3 నిందితులుగా ఎవరెవరిని చూస్తున్నారు? బాబు చెప్తున్నట్టుగా పాపం మొత్తం మోడీదేనా? లేక తన స్వార్థం కోసం నాలుగేళ్ళుగా చంద్రబాబే హోదాతో సహా రాష్ట్ర ప్రయోజనాలన్నింటినీ తాకట్టు పెట్టారనుకుంటున్నారా? 2014 ఎన్నికల ప్రచారంలో మోడీ, బాబులు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రశ్నిస్తా, పోరాటం చేస్తా అన్న పవన్ కళ్యాణ్‌ని కూడా ఇప్పుడు ప్రజలు నిందితుడిగా చూస్తున్నారా? ప్రతిపక్ష నేత జగన్ విషయంలో ప్రజా స్పందన ఏంటి? అని ఈ సర్వే నిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నించారు.

ఈ సర్వేలో షాకింగ్ నిజాలు తెలిశాయి. విభజన తర్వాత నుంచీ నాలుగేళ్ళ కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా నష్టపోవడానికి ప్రధాన దోషిగా చంద్రబాబునే చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. విభజనలో కూడా చంద్రబాబు పాపం ఉన్నప్పటికీ ఆయన అనుభవం రాష్ట్రానికి పనికొస్తుందన్న ఉద్ధేశ్యంతో ఓట్లు వేశామని…… అయితే చంద్రబాబు మాత్రం ఓటుకు కోట్లు కేసు తర్వాత నుంచీ తన వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకుని ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలను ప్రచార మాయతో, అబద్ధాలతో నమ్మించే ప్రయత్నం చేస్తూ దారుణంగా మోసం చేశాడని చెప్పుకొచ్చారు ప్రజలు. మొత్తంగా చంద్రబాబునే ఎ1గా తేల్చేశారు. ఇక నరేంద్రమోడీని కూడా నమ్మి ఓట్లేశామని…. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఈనాడు, ఆంధ్రజ్యోతిలు చెప్పిన మాటలు నమ్మి మోడీకి ఓట్లేశామని, ప్రత్యేక హోదా ఇస్తాడన్న ఉద్ధేశ్యంతోనే మోడీని గెలిపించామని అయితే మోడీ మాత్రం ఎంచక్కా చంద్రబాబుతో కుమ్మక్కయి ప్యాకేజ్ డ్రామా నడిపించి హోదాకు మంగళం పాడేశాడని ఎక్కువ మంది ప్రజలు తేల్చేశారు. అలాగే పవన్ కళ్యాణ్‌ని కూడా నిందితుడిగానే చూస్తున్నారు ప్రజలు. 2014 ఎన్నికల్లో ప్రజలకు అండగా నిలబడతానన్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మాత్రం పూర్తిగా సినిమాలకు పరిమితమయ్యాడని, నాలుగేళ్ళు చంద్రబాబుకు భజన చేస్తూ ప్రజలను గాలికి వదిలేశాడని చెప్పుకొచ్చారు. మొత్తంగా చూస్తే మొదటి ముగ్గురు నిందితులుగా చంద్రబాబు, మోడీ, పవన్‌లను నిలదీస్తున్నారు ప్రజలు. అయితే జగన్ విషయంలో మాత్రం ఎక్కువ శాతం మంది ప్రజలు సమర్థించారు. 2014 ఎన్నికలు అయిపోయిన తర్వాత నుంచీ ఎక్కువ సమయం ప్రజల మధ్య ఉన్నది జగన్ ఒక్కడేనని…..విషయం ఏదైనా కూడా ప్రజల కోసం, ప్రజలను సమర్థిస్తూ ….ప్రజల మధ్యన ఉండడానికి మించి ఒక ప్రతిపక్ష నాయకుడు ఏం చేయగలడని ప్రజలు చెప్పుకొచ్చారు.

మొత్తంగా చూస్తే అరిగిపోయిన రికార్డులాగా తాను, సోనియా గాంధీ కలిసి పెట్టించిన కేసులను ప్రస్తావిస్తూ ఎ1, ఎ2 అంటూ సంబరపడుతున్న చంద్రబాబు…….. ఆ అరిగిపోయిన రికార్డును వల్లె వేయడం మానేసి నాలుగేళ్ళుగా రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసింది ఎవరు అన్న ప్రశ్నకు ఎ1 నిందితుడిగా తనను ఎన్నుకున్న వైనంపై దృష్టి సారిస్తే బెటర్ అన్నది విశ్లేషకుల మాట. ప్రస్తుతం ఈ సర్వే రిజల్ట్స్ టిడిపి, వైకాపా, జనసేన నాయకుల మధ్య ప్రస్తావనకు వస్తున్నాయి. త్వరలోనే ఆ జాతీయ మీడియా సంస్థ ఈ సర్వే ఫలితాలను ప్రకటించి……. రోజంతా కూడా జాతీయ స్థాయిలో చర్చా కార్యక్రమం నిర్వహించనుంది. అప్పుడే చంద్రబాబు, మోడీల బాగోతం కూడా పూర్తిగా బయటపడుతుందని ఈ సర్వే వివరాలు తెలిసిన సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -