Thursday, March 28, 2024
- Advertisement -

అల్లు అర్జున్ ఇప్పటివరకు వదిలేసిన సినిమాలు ఇవే..!

- Advertisement -

మార్చి 28 2003 లో గంగోత్రి తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అల్లు అర్జున్. మొదటి సినిమానే స్టార్ డైరెక్టర్ కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో నటించాడు. ఈ సినిమాని అల్లు అరవింద్, అశ్వినీ దత్ కలిసి నిర్మించారు. మొదటి సినిమాతోనే బన్నీ సూపర్ హిట్ అందుకున్నాడు. తర్వాత వరుస హిట్స్ తో దూసుకెళ్ళాడు.

ఇక ఏకంగా తెలుగు రాష్ట్రాల్లో ‘బాహుబలి 1’ రికార్డులనే బ్రేక్ చేసాడు. బన్నీకి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎక్కువ .. అందుకే అతనికి ఫెయిల్యూర్స్ బాగా తక్కువ. కేవలం తెలుగులో మాత్రమే కాదు మలయాళంలో కూడా స్టార్ హీరోనే..! అక్కడి హీరోలకు కూడా సాధ్యం కానీ కలెక్షన్స్ బన్నీ సినిమాలకి వస్తుంటాయి. 19 ఏళ్ల లో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

జయం: అప్పటిలో మంచి పీక్స్ లో ఉన్నా తేజ తో అల్లు అర్జున్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేయలనుకున్నడు అల్లు అరవింద్. అప్పుడు తేజ అల్లు అర్జున్‌ కోసం రాసుకున్న కథ జయం. తర్వాత కొన్ని కారణాల వలన ఆ కథతో నితిన్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మంచి హిట్ కూడా అందుకున్నారు.

భద్ర: ముందుగా భద్ర కథ ను అల్లు అర్జున్ చెప్పాడు బోయపాటి శ్రీను. అప్పటికే లవ్ స్టోరీ ట్రాక్ లో ఉన్న అల్లు అర్జున్ మాస్ సినిమాల పై ఆసక్తి చూపకపోవడంతో.. రవితేజ తో తీసారు బోయపాటి శ్రీను.

బొమ్మరిల్లు: అల్లు అర్జున్ కు ఈ కథ నచ్చింది, కాని హ్యాపీ సినిమాతో బిజీగా ఉండడంతో చేయలేకపోయాడు. తర్వాత సిద్ధార్థ హీరోగా దర్శకుడు భాస్కర్ తెరకెక్కించి విజయం అందుకొన్నాడు.

100 % లవ్ : ముందు ఈ కథను అల్లు అర్జున్ కోసం రాసుకున్నారు సుకుమార్. ఎందుకో ఈ కథకు అసలు కనెక్ట్ కాలేకపోయాడు అల్లు అర్జున్. తర్వాత నాగచైతన్య తో సినిమా తీసారు సుకుమార్.

కృష్ణాష్టమి: వాసు వర్మ ముందుగా లవర్ పేరుతో బన్నీ కోసం ఈ కథ సిద్ధం చేశాడు. అల్లు అర్జున్ రిజెక్ట్ చేసేసరికి సునీల్ తో కృష్ణాష్టమి టైటిల్ తో సినిమా చేసాడు.

పండగ చేస్కో : ఈ సినిమా కూడా ముందుగా దర్శకుడు గోపీచంద్ మలినేని, రైటర్ కోన వెంకట్ కథను అల్లు అర్జున్ చెప్పాగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. తర్వాత రామ్ తో పండగ చేస్కో సినిమా తీశారు.

అర్జున్ రెడ్డి: ఈలాంటి కథ చేయడానికి అల్లు అర్జున్ ధైర్యం చేయకపోవడంతో సందీప్ రెడ్డి వంగా విజయ్ దేవరకొండతో చేసి సరికొత్త ట్రెండ్ సెట్ చేశాడు.

నానీస్ గ్యాంగ్ లీడర్: విక్రమ్ కె కుమార్ గ్యాంగ్ లీడర్ కథ ముందు అల్లు అర్జున్ కు చెప్పాడు. ఎందుకో చివరి నిమిషంలో డ్రాప్ అయ్యాడు అల్లు అర్జున్. తర్వాత నానితో తెరకెక్కించాడు విక్రమ్ కే కుమార్.

డిస్కో రాజా : డిస్కో రాజా సినిమా అల్లు అర్జున్ తోనే ప్లాన్ చేశాడు దర్శకుడు వి.ఐ.ఆనంద్. అల్లు అర్జున్ రిజెక్ట్ చేయగా తర్వాత రవితేజతో డిస్కో రాజా తీయగా వర్కౌట్ కాలేదు.

జాను : తమిళంలో విజయం సాధించిన 96 సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకున్న దిల్ రాజు.. దర్శకుడు ప్రేమ్ కుమార్ తో కథ
అల్లు అర్జున్ చెప్పించగా సున్నితంగా రిజెక్ట్ చేశాడు అల్లు అర్జున్. తర్వాత ఇదే సినిమాను శర్వానంద్, సమంత జంటగా జాను పేరుతో రీమేక్ చేస్తే తెలుగులో డిజాస్టర్ అయింది.

గీత గోవిందం: సినిమాలో హీరోయిన్ డామినేషన్ ఉండడంతో అల్లు అర్జున్ స్టార్ ఇమేజ్ ఈ కథకు అడ్డు వచ్చిందని విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కించి సంచలన విజయం అందుకొన్నాడు దర్శకుడు పరశురామ్.

ఒక లైలా కోసం: ఈ సినిమా కూడా ముందుగా అల్లు అర్జున్ అనుకున్న దర్శకుడు విజయ్ కుమార్ కొండ తర్వాత నాగచైతన్య తో సినిమా చేసారు.

అరవింద సమేత: అల్లు అర్జున్ కు త్రివిక్రమ్ కు మద్య మంచి బాండింగ్ ఉంది దాంతో తరచుగా అల్లు అర్జున్ త్రివిక్రమ్ లు కలుస్తూనే ఉంటారట ! అలాగే ఇద్దరూ కలిసి జులాయి , సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు చేసారు. అరవింద సమేత కథ కూడా అల్లు అర్జున్ కు త్రివిక్రమ్ చెప్పాడు.. యాక్షన్ , ఎంటర్ టైన్ మెంట్ తక్కువగా ఉండటంతో అల్లు అర్జున్ అరవింద సమేత కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని. త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో చేసి ఘన విజయం సాదించారు.

Also Read

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే..!

ప్రభాస్ వదిలుకున్న సూపర్ హిట్ సినిమాలు ఇవే..!

నంబర్ వన్ హీరోల పొంగల్ ఫైట్.. ఇక రచ్చ రచ్చే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -