ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది కంటే తక్కువ సమయమే ఉంది. 2019లో ఎవురు అధికారంలోకి వస్తారు అన్న విషయంపై జోరుగా విశ్లేషణలు జరుగుతూ ఉన్నాయి. జాతీయ స్థాయి మీడియా సంస్థలు, సర్వే సంస్థలు, తెలుగు మీడియా సంస్థలతో పాటు ఆయా పార్టీల నాయకులు కూడా గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ తెలుసుకుంటూ ఉన్నారు. తాజాగా తెలుగు సీనియర్ జర్నలిస్టులు చేపట్టిన ఒక గ్రౌండ్ లెవెల్ సర్వేలో 2019 ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి రావడం ఖాయమని తేలింది.
ఇతర విషయాలు అన్నీ పక్కన పెడితే 2019లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఎవరికి కలిసొస్తుంది అనే అంశంపై ఈ సీనియర్ జర్నలిస్టుల బృందం సర్వే చేసింది. 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు పూర్తిస్థాయిలో మద్దతిచ్చాడు పవన్. చంద్రబాబు ఇచ్చిన హామీలకు నాదీ పూచీ అని కూడా పవన్ ప్రజలకు హామీ ఇచ్చాడు. పవన్ ఫ్యాక్టర్‌తో పాటు మోడీ మేనియా కూడా కలిసొచ్చినప్పటికీ వైకాపా కంటే టిడిపికి కేవలం 5లక్షల ఓట్ల మెజార్టీ మాత్రమే వచ్చింది. 2019 ఎన్నికల్లో ఐదేళ్ళపాటు అధికారంలో ఉండి ఏమీ చేయలేకపోయాడన్న వ్యతిరేకత చంద్రబాబుకు నష్టం చేస్తుందనడంలో సందేహం లేదు. తాను ఇచ్చిన రుణమాఫీలాంటి హామీలతో పాటు మోడీది నాదీ అభివృద్ధి జోడీ…..మోడీని గెలిపిస్తే హోదాతో సహా అన్ని విభజన హామీలు నెరవేరేలా చేస్తా అన్న చంద్రబాబు ఆ విషయంలో కూడా పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. ఇక 2019 ఎన్నికల్లో పవన్ కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా పోటీ చేయనున్నాడు. పవన్ కళ్యాణ్ చీల్చే ఓట్లు అన్నీ కూడా 2014 ఎన్నికల్లో టిడిపికి పడిన ఓట్లే అని చెప్పడానికి సందేహం అక్కర్లేదు. ఎందుకంటే పవన్ అభిమానించేవాళ్ళందరూ కూడా 2014లో చంద్రబాబుకే ఓటేశారు అన్నది నిజం.
ఇక జగన్ విషయానికి వస్తే 2014 ఎన్నికల్లో జగన్‌కి ఓట్లేసిన వాళ్ళెవ్వరూ కూడా 2019 ఎన్నికల్లో కూడా మనసు మార్చుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఎన్నికల హామీల విషయంతో సహా ప్రత్యేక హోదా లాంటి అన్ని విషయాల్లోనూ చంద్రబాబుకంటే తానే ఎక్కువగా మాట మీద నిలబడతాను అని జగన్ నిరూపించుకున్నాడు. అన్నింటికీ మించి గతంలో ఏ ప్రతిపక్ష నాయకుడూ చేయనట్టుగా……..ఇప్పుడు దేశంలో ఉన్న వేరే ఏ ప్రతిపక్ష నాయకుడూ చేయలేని స్థాయిలో వైఎస్ జగన్ అనుక్షణం ప్రజల మధ్యనే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో 2014 ఎన్నికల్లో జగన్‌కి ఓటేసిన వాళ్ళందరూ కూడా ఈ సారి కూడా జగన్‌కే ఓటేసే అవకాశం ఉంది. ఇక చంద్రబాబు ఓట్లను పవన్ కళ్యాణ్ చీల్చడంతో పాటు……చంద్రబాబుపైన ఉన్న వ్యతిరేకత కూడా జగన్‌కే కలిసి రానున్న నేపథ్యంలో 2019లో జగన్ అధికారంలోకి రావడం ఖాయం అని ఈ సీనియర్ జర్నలిస్టుల రిపోర్ట్స్ చెప్తున్నాయి.