పాపం నారా లోకేష్…….తనను తాను నాయకుడిగా నిరూపించుకోవడానికి నానా కష్టాలూ పడుతున్నాడు. గట్టిగా నాలుగు మాటలు మాట్లాడడం రాకపోయినప్పటికీ లోకేష్ ఎడిటోరియల్స్ రాస్తున్నాడని పచ్చమీడియా కూడా జాకీలేసి లేపుతోంది. ఇక తండ్రి అయిన చంద్రబాబు కూడా లోకేష్‌ని నిలబెట్టడం కోసమే పన్నుతున్న వ్యూహాలు అన్నీ ఇన్నీ కాదు. 2009లో తనను ముఖ్యమంత్రిని చేయడం కోసం ప్రాణాల మీదకు తెచ్చిన ఎన్టీఆర్‌ని అడ్డంగా తొక్కేయాల్సిన పరిస్థితికి వచ్చాడు చంద్రబాబు. అయినా ఏం లాభం……లోకేష్ మాత్రం ఎప్పటికప్పుడు తన మేథాసంపత్తితో ఏదో ఒకటి మాట్లాడేస్తూ నెటిజనుల చేతిలో ‘పప్పు’ అయిపోతున్నాడు.
తాజాగా మరోసారి నెటిజనుల చేతికి చిక్కాడు లోకేష్. ఫైబర్ నెట్ అంటూ చంద్రబాబు, లోకేష్‌లు ఇద్దరూ కూడా భయంకరమైన హంగమా, హైప్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సందర్భంలోనే లోకేష్ ఒక అమూల్యమైన మాట మాట్లాడేశాడు. ప్రతి ఒక్కరూ కూడా రోజుకు ఒక జీబీ డేటా వాడితే జిడిపి ఒక శాతం పెరుగుతుందన్నాడు. ఒక జిబి డేటా……..జిడిపి అనే పదాలు దగ్గరగానే ఉన్నాయి కాబట్టి చెప్పాడో లేక ప్రాస అదిరిందని చెప్పాడో కానీ తన నోటికి వచ్చిన మాట అనేశాడు లోకేష్. లోకేష్ మాటలు ఎంత పెద్ద తప్పో …..ఎంత అర్థం లేనివో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదుగా. ఈ డేటా వినియోగంపై బాగా అవగాహన ఉన్న నెటిజనులు ఇప్పుడు లోకేష్‌ని మరోసారి ‘పప్పు’ను చేస్తున్నారు. అమెరికాలో చదవిన అగ్రశ్రేణి స్టూడెంట్ నాలెడ్జ్ ఇదేనా? లోకేష్‌కి ప్రపంచానికి పాఠాలు చెప్పిన చంద్రబాబు నేర్పించిన జ్ఙానం ఇదేనా? టెక్నాలజీ అంటేనే తమ సొంతం అని చెప్పే నారావారి నాలెడ్జ్ ఇంతేనా? అని విరుచుకుపడిపోతూ జోకుల వర్షం కురిపిస్తున్నారు నెటిజనులు.
ఇక చంద్రబాబు, లోకేష్‌లు పరస్పరం నమస్కారం చేసుకుంటూ ఉన్న ఫొటో కూడా నెట్‌లో కామెడీ కామెడీ అవుతోంది. ఏంటో ఈ లోకేష్ బాబు…..ఎప్పటికి నాయకుడవుతాడో తెలియదు కానీ నెటిజనులకు మాత్రం మంచి ఆనందం పంచుతున్నాడు.