రాష్ట్ర విభజన జరిగిపోతున్నా ……. సీమాంధ్రకు పూర్తి స్థాయిలో నష్టం జరుగుతున్నా కనీసం స్పందించలేని చేతకానితనం…అయితేనేం ఎన్నెన్నో అబద్ధాలు…..ప్రజలను మాయచేయడాలు…….పవన్ లాంటి పొలిటికల్ ఆర్టిస్ట్స్‌తో కలిపి, సమైక్యాంధ్ర ఉద్యమ ద్రోహి అయిన ఉద్యోగ సంఘాల నేత, ఇక కాంగ్రెస్ చివరి సిఎంతో లోపాయికారి ఒప్పందాలకు తోడు మోడీ మేనియా కలిసొచ్చి అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు. అయితే ఆ తర్వాత నుంచీ మాత్రం బాబుకు అన్నీ కష్టాలే. ఓటుకు నోటు కేసు తర్వాత నుంచీ అయితే తన కంటే జూనియర్, తన కింద పనిచేసిన కెసీఆర్ దగ్గర సాగిలపడాల్సిన పరిస్థితి. ఇక మోడీ దగ్గర 80ల నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రుల కంటే ఎక్కువగా బానిసత్వం చూపిస్తున్నాడు చంద్రబాబు. అయితే అధికారంలో ఉన్నాను అని మాత్రం అనిపించుకుంటున్నాడు. కానీ చంద్రబాబు అధికారం 2019 వరకే ఉండబోతుందా అన్న అనుమానాలు రాజకీయ పరిణామాలను పరిశీలిస్తున్న విశ్లేషకులకు అర్థమవుతూ ఉన్నాయి.
జగన్‌కి వ్యతిరేకంగా చంద్రబాబుకు దొరికిన అతి పెద్ద అస్త్రం జగన్‌పై ఉన్న అక్రమాస్తుల కేసులు. ఆ కేసులు కూడా సోనియా, చంద్రబాబులు కలిసి వేయించినవే అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే బాబు, టిడిపి భజన మీడియా, పవన్ కళ్యాణ్‌లు ఇష్టారీతిన జగన్ కేసుల గురించి ప్రస్తావించి జనాలను నమ్మించగలిగారు. కానీ జగన్‌పై ఉన్న కేసులు నిలబడవని ఇప్పుడు మరోసారి న్యాయకోవిదులు చెప్తున్నారు. టూ జీ స్పెక్ట్రం కేసులే సాక్ష్యాలు లేక కొట్టేస్తున్న నేపథ్యంలో జగన్‌పై ఉన్న కేసులు నిలబడే అవకాశమే లేదని మాజీ డీజిపి, అండ్ సీనియర్ న్యాయకోవిదులు చెప్తున్నారు. జగన్ కేసుల్లో సాక్ష్యాలు అస్సలు లేవని, కేవలం జగన్‌ని రాజకీయంగా దెబ్బతీయడం కోసమే విచారణ అంటూ సాగదీస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు. సిబిఐని నాటి సోనియాగాంధీ కేవలం జగన్‌ని దెబ్బతీయడం కోసం మాత్రమే ఉపయోగించుకుందని, చంద్రబాబు కూడా తనవంతు సాయం చేశారని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు రాజా, కనిమొళి కేసుల్లో సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా కేసులు కొట్టేయడంతో అసలే సాక్ష్యాలు లేని జగన్ కేసులు కూడా నిలబడే ఛాన్సే లేదని వాళ్ళు చెప్తున్నారు. మామూలుగా అయితే ఇలాంటి తీర్పులు వచ్చినప్పుడల్లా రెచ్చిపోయే టిడిపి బ్యాచ్ అందరూ కూడా ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఏం మాట్లాడినా మోడీని విమర్శించినట్టు అవుతుందేమో అని వాళ్ళ మథనపడుతున్నారు. చంద్రబాబు కూడా ఏమీ మాట్లాడొద్దని చెప్పి తన పార్టీ నాయకులకు స్పష్టంగా చెప్పినట్టుగా తెలుస్తోంది. జగన్ కేసుల విషయంలో ఈ తీర్పు జగన్‌కి అతి పెద్ద బూస్ట్ అనుకోవచ్చు. అందుకే టిడిపి నాయకుల్లో కూడా అంతర్మథనం మొదలైంది. రేపు ఇలాంటి తీర్పే జగన్ కేసుల విషయంలో కూడా వస్తే 2019 ఎన్నికలు ఒన్ సైడ్ స్వీప్ అవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.