Monday, May 5, 2025
- Advertisement -

జగన్, పవన్ ప్రశ్నలు అవే….. కానీ పవన్ పోలవరం పూర్తవ్వాలనుకుంటున్నాడట….. జగన్ అడ్డుకుంటున్నాడట… మొత్తం బాబు మార్క్ డ్రామా ఇదే

- Advertisement -

సీమాంధ్ర ప్రజలకు పోలవరం ప్రాజెక్ట్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దశాబ్ధాలుగా తెలుగు మీడియా చెప్తూనే ఉంది. కానీ 2004 వరకూ దశాబ్ధం పాటు పరిపాలించిన చంద్రబాబు ఏనాడూ పోలవరాన్ని పట్టించుకున్నది లేదు. 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి అన్ని అనుమతులూ తెప్పించి యుద్ధ ప్రాతిపదికన పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేయాలని తలపెట్టాడు. ఇప్పుడు పట్టిసీమ పారుతున్నది కూడా వైఎస్పార్ నిర్మించిన కాలువల ద్వారానే. కానీ వైఎస్పార్ చనిపోయిన తర్వాత మాత్రం పోలవరం పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మాత్రం పోలవరాన్ని తానే నిర్మిస్తానని కేంద్రం నుంచి అడిగి తీసుకున్నాడు. ఆ తర్వాత కథ అందరికీ తెలిసిందే. కేంద్రం, రాష్ట్రాల మధ్య నిర్మించిన క్రెడిట్ ఎవరికి దక్కాలన్న పొలిటికల్ గేం నడుస్తోంది. ప్రాజెక్ట్ నిర్మాణ వ్యవహారం మళ్ళీ మొదటికి వచ్చింది.

తనంత సమర్థుడు ఇంకెవ్వరూ లేరు కాబట్టి కేంద్రం తననే పోలవరం ప్రాజెక్ట్ నిర్మించమని చెప్పిందని చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పాడు. కానీ తాను నిర్మిస్తానని చెప్పి చంద్రబాబే కేంద్రాన్ని అడిగి తన చేతుల్లోకి తీసుకున్నాడని జగన్ సాక్ష్యాలతో సహా అదే అసెంబ్లీలో నిరూపించాడు. ఇక పోలవరం అవకతవకలపై జగన్ సాక్ష్యాలతో సహా చాలా సార్లు మాట్లాడి చంద్రబాబు తప్పులను బయటపెట్టాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా జగన్ మాటలనే చెప్తున్నాడు. తాను నిర్మిస్తానని చెప్పి తన చేతుల్లోకి పోలవరాన్ని తీసుకున్న చంద్రబాబు ప్రాజెక్ట్ పూర్తి చేయాల్సిన బాధ్యత ఉందని పవన్ చెప్తున్నాడు. ఇక పోలవరంపై శ్వేత పత్రం విడుదల చేయమంటున్నాడు. అలాగే పోలవరంపై అఖిల పక్షం వేసి అందరినీ కేంద్రం దగ్గరకు తీసుకెళ్ళమంటున్నాడు. పోలవరం అక్రమాలు బయటపెట్టమంటున్నాడు. కేంద్రంతో కలిసి డ్రామాలు ఆడితే ప్రజలు చంద్రబాబును కూడా నమ్మరని చెప్తున్నాడు. జగన్ చేసిన విమర్శలనే పవన్ కూడా చేస్తున్నాడు. అయితే చంద్రబాబు మాత్రం ఒకేలా మాట్లాడిన జగన్, పవన్‌లలో రెండు రకాల యాంగిల్స్ చూశాడు.

పవన్ కళ్యాణ్ మాత్రం పోలవరం ప్రాజెక్ట్ పూర్తవ్వాలన్న కోరికతో ప్రశ్నిస్తున్నాడట. జగన్ మాత్రం ప్రాజెక్ట్ అడ్డుకోవడానికే అడుగుతున్నాడట. భలే…భలే……ఇద్దరూ అడిగింది ఒకే ప్రశ్న అయినప్పుడు ఇద్దరి ఉద్ధేశ్యాలు రెండు రకాలుగా ఎందుకుంటాయి? చంద్రబాబు దృష్టిలో ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ పవన్ వ్యవహారం చంద్రబాబుతో కలిసి ఆడుతున్న డ్రామా కాబట్టి. ఎల్లో మీడియాను ఫాలో అయ్యే జనాలు కాస్త పరిశీలనగా చూస్తే ఆంద్రజ్యోతి మరీ అడ్డంగా జగన్‌కి వ్యతిరేకంగా చంద్రబాబుకు అనుకూలంగా రాస్తూ ఉంటుంది కానీ ఈనాడు మాత్రం అప్పుడప్పుడు ‘ఊర్లకు ఊర్లు ఖాళీ అయిపోతున్నాయి’ అన్న నిజాలను కూడా రాస్తూ ఉంటుంది. ఆ రకంగా ప్రజల ప్రయోజనాల కోసం చంద్రబాబుకు వ్యతిరేకంగా కూడా రాస్తాం అని జనాలను నమ్మిస్తూ ఉంటుంది. ఐదేళ్ళపాటు అలాంటి డ్రామాలు ఆడి…..ఎన్నికల సమయం వచ్చేసరికి మాత్రం పూర్తిగా బాబు భజనలో వైఎస్‌లకు వ్యతిరేకంగా విషయం చిమ్మటంలో ఆంధ్రజ్యోతిని మించిపోతుంది. లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ కథ కూడా సేం టు సేం. 2014ఎన్నికల సమయంలో చంద్రబాబు ఉచిత హామీల గురించి జెపి ఎన్ని సార్లు మాట్లాడాడు? ఇదే జెపి వైఎస్ ఉచిత పథకాలను ఎన్ని వందల సార్లు విమర్శించాడు. అంతా ఒకే తాను ముక్కలే. చంద్రబాబు కోసం డ్రామాలే. ఇప్పుడు పవన్ వ్యవహారం కూడా సేం టు సేం.

జగన్‌ని పది తిట్లు డైరెక్ట్‌గా తిట్టి బాబును కూడా సుతిమెత్తగా నాలుగు మాటలు అంటాడు. ఎన్నికల సమయం వచ్చేసరికి సీమాంధ్రులకు చంద్రబాబు తప్ప మరో దిక్కులేదు అని మరోసారి పాత పాట ఎత్తుకుంటాడు. బాబు ఏమీ చేయకపోయినా….బాబు తప్ప వేరే దిక్కులేదని….బాబుకు ఓటేయండని చెప్పుకొస్తాడు. ఈ డ్రామా మొత్తం చంద్రబాబు నడిపిస్తున్నదే కాబట్టే పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్ళిన పవన్‌కి అమిత ప్రాధాన్యం…ఎస్ ఈ స్థాయి అధికారి పవన్‌కి పోలవరం చూపించడం కోసం ఒక రోజు కేటాయించడం….ఇక చంద్రబాబుకు మాత్రమే భజన చేసే ఎల్లో మీడియా పవన్‌కి అమిత ప్రాధాన్యం ఇస్తూ లైవ్ కవరేజీలు ఇవ్వడం…..కాదంటారా? చంద్రబాబు డ్రామాలో పవన్ పావు కాదని నమ్మగలమా? ప్రజల సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదు అని ప్రతిపక్ష నాయకుడిని నిలదీసిన పవన్‌ని ఏమని అనుకోవాలి? ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరకిపోయిన చంద్రబాబు అవినీతి పరుడు కాదు……ఇంత వరకూ ఒక్క కేసు నిరూపణ కాని జగన్ అవినీతి పరుడు అని చెప్పే పవన్ ఎవరి జేబులో బొమ్మో తెలుసుకోలేని స్థితిలో సీమాంద్ర ప్రజలు ఉన్నారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -