Sunday, May 4, 2025
- Advertisement -

గెలుపు ఈక్వేషన్స్ అన్నింటినీ చంద్రబాబే వైకాపాకు సాధించి పెట్టాడా?

- Advertisement -

అధికారాన్ని స్వయంగా తానే జగన్ చేతుల్లో పెట్టేంత స్థాయి తప్పులను చంద్రబాబు చేశాడా? చంద్రబాబు సెల్ఫ్ గోల్స్ దెబ్బకు ఆయన పూర్తిగా మునగడంతో పాటు టిడిపి కూడా పతనావస్థకు చేరుకుందా? ఇప్పుడు ఇవే చర్చలు ఢిల్లీ స్థాయి జర్నలిస్టులు, విశ్లేషకుల్లో నడుస్తున్నాయి. ఏ నాయకుడికైనా, పార్టీకైనా విశ్వసనీయతే ముఖ్యం. కనీసం రాజకీయ పార్టీలకు, నాయకులకు అయినా నమ్మకంగా అనిపించాలి. కానీ 2014 ఎన్నికల్లో గెలుపు కోసం అడ్డమైన హామీలు ఇచ్చి ప్రజలు ఇక ఎప్పటికీ తన హామీలను నమ్మే పరిస్థితి లేకుండా చేసుకున్న చంద్రబాబు……….అధికారంలోకి వచ్చాక ఒక వైపు మోడీతో పొత్తు ఉండగానే కాంగ్రెస్‌తో చీకటి సంసారం నడిపి మోడీకి దూరమయ్యాడు.

అన్నింటికీ మించి వైస్సార్ చనిపోయిన తర్వాత నుంచీ కాంగ్రెస్‌తో కుమ్మక్కయి కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి సహకరించడం, జగన్‌ని కేసుల్లో ఇరికించే విషయంలో సోనియాతో చేతులు కలపడం లాంటి వాటితోనే రాజకీయాల్లో విశ్వసనీయత కోల్పోయాడు చంద్రబాబు. ఇక మోడీ సాయంతో అధికారంలోకి వచ్చి……నాలుగేళ్ళు కేంద్రంలో అధికారాన్ని అనుభవించి…..తీరా మోడీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఘోరంగా ఓడిస్తారన్న విషయం అర్థం చేసుకుని మోడీకి టాటా చెప్పాడు. అయితే ఆ తర్వాత మోడీ విషయంలో చంద్రబాబు మరీ ఘోరంగా విమర్శలు చేస్తూ, శతృవులు అందరినీ మోడీకి అంటకడుతూ చేస్తున్న రాజకీయం మాత్రం ప్రజల్లో చంద్రబాబు పట్ల ఏవగింపు కలిగేలా చేస్తోంది.

2019 ఎన్నికల్లో వైకాపా విజయం సాధిస్తుంది అని మామూలుగా తేల్చడం లేదు జాతీయ సర్వేలు. దాదాపుగా పది శాతం తేడాతో వైకాపా గెలుస్తుందని చెప్పడం మాత్రం ఇప్పుడు విశ్లేషకులను ఆశ్ఛర్యపరుస్తోంది. ఆ స్థాయిలో వ్యతిరేకత ఉందా అంటే అవుననే అంటున్నారు జాతీయ స్థాయి విశ్లేషకులు. టిడిపిలో ఉన్న నాయకులతో సహా రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఏవీ కూడా ఇప్పుడు చంద్రబాబును నమ్మే స్థితిలో లేవు. 2014 ఇచ్చిన ఏ ఒక్క హామీని సంపూర్తిగా అమలు చేయని నేపథ్యంలో ప్రజలు కూడా చంద్రబాబు ఇచ్చే హామీలను 2019 ఎన్నికల్లో నమ్మే అవకాశం లేదు. అన్నింటికీ మించి చంద్రబాబు అవినీతి, అక్రమాలతో పాటు నమ్మించి మోసం చేసిన వైఖరికి పవన్ కళ్యాణ్, నరేంద్రమోడీతో పాటు తాజాగా కేసీఆర్‌ కూడా 2019లో చంద్రబాబును ఓడించడానికి సర్వ శక్తులూ ఒడ్డుతానడంలో సందేహం లేదు.

పవన్, మోడీతో పొత్తు పెట్టుకుని, నాలుగేళ్ళు ఫలాలు అనుభవించాక దూరమైనట్టుగానే, ఓటుకు నోటు తర్వాత వెల్కం గ్రూప్ వెలమ-కమ్మ గ్రూప్ అని చెప్పి కేసీఆర్‌తో ఫ్రెండ్షిప్ అని కేసీఆర్ ని నమ్మించిన చంద్రబాబు అండ్ ఆయన భజన మీడియా జనాలు రామోజీరావు, రాధాకృష్ణలు ఇప్పుడు అదే కేసీఆర్ ఓటమి కోసం కుట్రలు పన్నుతూ ఉండడం జాతీయ స్థాయి నాయకులను కూడా ఆశ్ఛర్యపరుస్తోంది. దేశంలో ఉన్న ఏ ఒక్క పార్టీ, నాయకుడు కూడా చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదు. ఇక మోడీ, పవన్, కేసీఆర్‌లతో చంద్రబాబు కోరి తెచ్చుకున్న శతృత్వం కాస్తా జగన్‌కి పూర్తిగా ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మోడీ, పవన్, కేసీఆర్‌లు ముగ్గురూ కూడా చంద్రబాబు ఓటమి కోసం తీవ్రస్థాయిలో కృషి చేస్తారనడంలో సందేహం లేదు. ఆ రకంగా చూస్తే తన అవకాశవాదం, పదవీ దాహం, స్వార్థరాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాల పుణ్యమాని శతృవులను తయారు చేేసుకున్న చంద్రబాబు……..2019 ఎన్నికల్లో తన శతృవులందరూ కలిసి తనను ఓడించడంతో పాటు జగన్‌ని గెలిపించడం ఖాయం అన్న పరిస్థితిని కొని తెచ్చుకున్నాడనడంలో సందేహం లేదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -