Sunday, May 4, 2025
- Advertisement -

కన్ఫ్యూజన్ లో.. మరింత కన్ఫ్యూజ్ అవుతున్నాడు

- Advertisement -

చిరంజీవి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో.. ఎప్పుడు ఎలా అమలు చేస్తారో ఎవ్వరికీ అర్థం కాదు. అది రాజకీయమైనా.. తన 150వ సినిమా అయినా.. ఆఖరికి కొడుకు కొత్త సినిమా అయినా.

ఇప్పుడు కాపులకు రిజర్వేషన్లపై ముద్రగడ చేస్తున్న దీక్షకు సంబంధించి.. చిరంజీవి స్పందన చూస్తున్న వాళ్లంతా ఇదే మాట అనుకుంటున్నారు. కనీసం తమ్ముడిని చూసైనా.. ఎలాంటి సమయాల్లో సైలెంట్ గా ఉంటే బాగుండేదన్న విషయం నేర్చుకుంటే బాగుండేది కదా.. అని నిట్టూరుస్తున్నారు.

ముద్రగడ చేస్తున్న దీక్షకు మద్దతుగా.. చిరంజీవి ఈమధ్య వాయిస్ కాస్త గట్టిగానే వినిపించారు. తోటి కాపు నాయకుడు, తోటి కేంద్ర మాజీ మంత్రి అయిన దాసరి నారాయణరావుతో కలిసి చాలా కాలం తర్వాత మీడియా ముందుకు కూడా వచ్చారు. కానీ.. రానురాను పరిస్థితి మారిపోయింది. కాపు నాయకుల్లో.. చాలా మంది ప్రముఖులను దాసరి తన వర్గంగా చేసేసుకుని.. చిరంజీవిని ఒంటరి చేశారన్న ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టే.. పెద్దాయన సొంతంగా మీడియాకు బైట్లు ఇచ్చేస్తున్నారు. కట్ చేస్తే.. చిరంజీవి మాత్రం ఎప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితుల్లో.. చంద్రబాబుపై కామెంట్లు చేస్తూ.. మళ్లీ టీడీపీ నేతల చేత చీవాట్లు పెట్టించుకోవాల్సి వస్తోంది.

ఇలాంటి సిచువేషన్ లో.. ఎలాంటి అడుగు వేస్తే.. ఎలాంటి ఫలితం వస్తుందో అర్థం కాని అయోమయంలో చిరంజీవి ఉన్నారని తెలుస్తోంది. చివరికి ఏదీ తోచక.. తమ్ముడు కళ్యాణ్ తో కూడా మంతనాలు చేస్తున్నట్టు సమాచారం. అయితే.. రాజకీయాల్లో చిరంజీవి ఏ దిక్కుకు పోయినా.. తన దారి తనదే అన్నట్టు ప్రవర్తిస్తున్న పవన్.. ఈ విషయంలో కూడా అదే రూట్ ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోందని కొందరు అనుమానిస్తున్నారు. లేదంటే.. ఈ పాటికే అన్నయ్యతో కలిసి మీడియా ముందుకు వచ్చి.. ముద్రగడకు సంఘీభావం తెలిపి ఉండేవాడని లెక్కలేస్తున్నారు.

సో.. ఓవరాల్ గా.. ముద్రగడ ఎపిసోడ్ లో కాపు నాయకులంతా ఎవరి మైలేజ్ వారు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంటే.. చిరంజీవి మాత్రం తన ఇమేజ్ ను మరింత డ్యామేజ్ చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -