Tuesday, May 6, 2025
- Advertisement -

నాలుగు పదాలు మాట్లాడలేని లోకేష్…. ఈనాడుకు నాలుగు పేజీల వ్యాసం రాశాడా? ట్రోలింగ్ షురూ

- Advertisement -

మాట్లాడడం కంటే కూడా మౌనంగా ఉంటేనే లోకేష్‌కి ఎక్కువ పేరు వచ్చేలా ఉంది. కనీసం విమర్శలు, సెటైర్స్ పడకుండా ఉంటాయి. కానీ లోకేష్ మాట్లాడిన ప్రతిసారీ మాత్రం పిచ్చ కామెడీ పుట్టేస్తూ సోషల్ మీడియాలో సెటైర్స్ వర్షం కురిపిస్తోంది. రీసెంట్‌లో జైసింహా ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో బాలయ్య, లోకేష్‌ల ప్రసంగాలపై సోషల్ మీడియాలో సెటైర్స్ మామూలుగా పేలడం లేదు. ఆ ఎటకారం సునామీ కంటిన్యూ అవుతుండగానే ఇప్పుడు మరోసారి నెటిజనుల కోసం మరో కామెడీ చేశాడు లోకేష్.

ఈ రోజు ఈనాడు పేపర్‌లో దాదాపుగా చదవడానికే అరగంట సమయం పెట్టే వ్యాసం ఒకటి వచ్చింది. అందులో తత్వవేత్తల కొటేషన్స్ నుంచి ఎన్నెన్నో గొప్ప వాక్యాలు కనిపించాయి. ఇక ఆ తర్వాత చంద్రబాబునాయుడి గురించి, లోకేష్ గురించి కూడా భజన గట్టిగానే ఉంది. ఆ భజనతో పాటు సాంకేతిక విషయాలు కూడా ఎన్నో ఉన్నాయి. అంతా కూడా ఆంద్రప్రదేశ్‌లో ఈ రోజు నుంచి ప్రవేశపెట్టనున్న ఫైబర్ గ్రిడ్ గురించే. ఆ వ్యాసంలో వాస్తవాలు ఎన్నున్నాయి అన్న విషయం పక్కనపెడితే …..గట్టిగా నాలుగు మాటలు చక్కగా మాట్లాడలేని లోకేష్…..అంత పెద్ద వ్యాసం ఎలా రాశాడా అన్న అనుమానమే అందరికీ వస్తోంది. అవును మరి…..ఆ వ్యాస రచయిత లోకేష్ అని ఈనాడు చెప్పింది. ఆ వెంటనే నెటిజనులు ట్రోల్ చేయడం షురూ చేశారు. ఈ ఫైబర్ గ్రిడ్ గురించి అవగాహన ఉన్నవాళ్ళయితే …..ప్రభుత్వం చెప్తున్న తక్కువ రేటు కేవలం కొన్ని ఛానల్స్‌కి మాత్రమే అని, ఆ తర్వాత ఇంటర్నెట్, ఫోన్ సౌకర్యాల కనెక్షన్స్ మాత్రమే ఇస్తారని….కానీ అన్నింటికీ కూడా సెపరేట్ సెపరేట్ బిల్లు ఉంటుందని చెప్తున్నారు. జియో, ఎయిర్‌టెల్‌లు మొబైల్ డేటా ఇస్తున్న రేట్లకంటే ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న ప్యాకేజీలు చాలా ఎక్కువ ఖరీదులో ఉన్నాయని చెప్తున్నారు. అలాగే సాక్షిలాంటి వ్యతిరేక మీడియా ఛానల్స్‌ని కట్టడి చేయడం కోసం బాబు ప్రభుత్వం వేస్తున్న కొత్త ఎత్తుగడ మాత్రమేనని….అంతకుమించి జనాలకు ఒరిగేది ఏమీ ఉండదట. అన్నింటికీ మించి బిడ్డింగ్ వ్యవహారాల్లాంటివేవీ లేకుండా జన్మభూమి కమిటీల్లాగే అన్ని పనులూ టిడిపి సభ్యులకు ఇవ్వడం మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలకు గురవుతోంది.

మొత్తానికి నాయకుడిగా లోకేష్‌ని జాకీలు పెట్టి లేపాలన్న పచ్చ బ్యాచ్ ప్రయత్నం అలా బెడిసికొట్టి లోకేష్‌పై సెటైర్లు పడడంతో పాటు ఫైబర్ గ్రిడ్‌లో ఉన్న లోపాలు, ప్రత్యర్థిని అణగదొక్కాలన్న చంద్రబాబు వ్యూహాలు మాత్రం సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చనీయాంశం అవుతున్నాయి. లోకేష్ నాలుగు పేజీల వ్యాసమా……మజాకానా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -