Wednesday, May 7, 2025
- Advertisement -

చుండ్రు సమస్యకు మంచి పరిష్కారం

- Advertisement -

మీరు చుండ్రుతో ఇబ్బంది పడుతుంటే ఓ అరకప్పు పెరుగులో కొద్దిగా తేనె కలిపి తలకు బాగా రాసుకుంటే చుండ్రు నుంచి విముక్తి పొందవచ్చు. మీ జుట్టు తెల్లపడుతుంటే హెన్నాను క్రమం తప్పకుండా వాడండి.

లేదంటే కరివేపాకు, ఉసిరికాయలను నూరి ఆ మిశ్రమాన్ని మజ్జిగతో కలిపి జుట్టుకు రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 

దువ్వెనను కుదుళ్ళలోనికి పోనిచ్చి ముందుగా చుండ్రుని తొలగించిన తర్వాత ఆయిల్‌ మసాజ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత  జుట్టుకు ఆవిరి పట్టి తలస్నానం చేయాలి. పెరుగులో నానపెట్టిన మెంతుల్ని మెత్తగా రుబ్బి, నాలుగు చుక్కల నిమ్మరసం చేర్చి జుట్టుకు ప్యాక్‌లా పది పదిహేను రోజులకి ఒకసారి క్రమం తప్పకుండా వేసుకుంటూ ఉండడం వల్ల మంచి ఫలితముంటుంది. 

పెరుగు, మజ్జిగను అధికంగా వాడటంతో పాటు కరివేపాకును ఆహారంలో అధికంగా ఉండేలా చూసుకోండి. కరివేపాకు, ఉసిరికాయలను మజ్జిగలో నూరిన ప్యాక్‌ను వాడటంతో పాటు మందారాకులను నూరి తలస్నానానికి వాడటం మంచిది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -