Tuesday, May 6, 2025
- Advertisement -

బాబుకు షాకిచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్….. ఎమ్మెల్యేలకు వార్నింగ్స్

- Advertisement -

ఉరుము ఉరిమి మంగళం మీద పడడం అంటే ఏంటో ఇప్పుడు టిడిపి ఎమ్మెల్యేలకు స్పష్టంగా అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్‌లో 2019 ఎన్నికల్లో టిడిపి పరిస్థితి ఏంటో స్పష్టంగా తెలిసిపోవడంతో ఇప్పుడు చంద్రబాబు అగ్గిమీద గుగ్గిలమవుతున్నాడు. ఇన్ని రోజులూ నా అంత తోపు పాలకుడు లేడు, ప్రపంచంలోనే నేనే నెంబర్ ఒన్. ఆంధ్రప్రదేశ్‌లో కంటే ఎక్కడా కూడా ఎక్కువ అభివృద్ధి జరగడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ తన పాలన పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తనను మళ్ళీ సిఎంని చేయడానికి కంకణం కట్టుకున్నారు అని ప్రగల్భాలు పలికిన చంద్రబాబుకు ఆయన సొంత ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కాస్తా దిమ్మతిరిగేలా చేశాయి. దాంతో ఇప్పుడు చంద్రబాబు తన సొంత పార్టీ ఎమ్మెల్యేలపై అంతెత్తున లేస్తూ అందరినీ తిట్టిపోస్తున్నాడని స్వయానా టిడిపి నాయకులే చెప్తున్నారు.

25 ఎంపిలు, 150 ఎమ్మెల్యేలు అన్న భ్రమలను టిడిపి నేతలకు కలిగించాలనుకున్న చంద్రబాబుకు సొంత ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ షాక్ ఇచ్చాయి. థంపింగ్ మెజార్టీతో జగన్ అధికారంలోకి రావడం ఖాయం అన్న రిపోర్ట్స్ రావడంతో చంద్రబాబు టెన్స్ అయిపోతున్నాడు. గొప్పగా ఏం జరిగినా ఆ ఘనత నాది. తేడా వస్తే ఆ తప్పు టిడిపి నేతలది, ఎమ్మెల్యేలది అన్న తరహాలో ఇప్పుడు ఈ ఫెయిల్యూర్ మొత్తం ఎమ్మెల్యేలపైకి నెట్టేస్తూ వరుసగా వాళ్ళకు క్లాసులు పీకుతున్నాడు. ఎమ్మెల్యేలపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. 2019 ఎన్నికల్లో టిడిపి ఓడిపోవడం ఖాయం……………ఆ ఓటమికి కారణం మీరే అన్న రేంజ్‌లో చంద్రబాబు క్లాసులు పీకుతూ ఉండడంతో టిడిపి ఎమ్మెల్యేలు షాక్ అవుతున్నారు. రీసెంట్ టూ త్రీ డేస్‌లోనే దాదాపు 15 మంది ఎమ్మెల్యేలకు, ఆయా నియోజకవర్గ నాయకులకు ఇదే రేంజ్‌లో క్లాసులు పీకాడు బాబు.

మొత్తం మీరే చేశారు……………నన్ను ఓడించేలా ఉన్నారు అంటూ వాపోయాడు. అయితే బయటికొచ్చిన తర్వాత ఆ ఎమ్మెల్యేలు మాత్రం చంద్రబాబుపై రివర్స్‌లో కామెంట్స్ చేస్తున్నారు. రాష్ట్రానికి ఏమీ చెయ్యకుండా, లోకేష్ అవినీతిని అడ్డుకోకుండా ఇప్పుడు మా పైన పడిస్తే ఏం ఉపయోగమని అంటున్నారు. ప్రజా నాయకుడిగా నిరూపించుకునే అవకాశమే లేని లోకేష్‌ని నాయకుడిగా నిలబెట్టడం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు, చిన్న చిన్న ట్రాన్స్‌ఫర్స్ విషయంలో కూడా చినబాబు కచ్చితంగా కమీషన్లు అడుగుతుండడం లాంటి పరిణామాలే టిడిపికి మైనస్ అయ్యాయని ఎమ్మెల్యేలు అంటున్నారు. మొత్తంగా చూస్తే టిడిపి ఓటమిని తేల్చేసిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఇప్పుడు పచ్చ నాయకుల్లో గుబులు రేపుతున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -