Saturday, May 3, 2025
- Advertisement -

కేసీఆర్‌తో కలిసి ప్రత్యూష భోజనం

- Advertisement -

తెలంగాణ సిఎం కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యూష భోజనం చేశారు. హైకోర్టు నుంచి సీఎం అధికారిక నివాసానికి వెళ్లిన ప్రత్యూషను సీఎం కేసీఆర్ ఆప్యాయంగా పలకరించి ఇంటికి ఆహ్వానించారు.

అనంతరం ప్రత్యూష ఆరోగ్య పరిస్థితిపై సీఎం పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురై తీవ్రంగా గాయపడిన ప్రత్యూష గ్లోబల్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం గ్లోబల్ అవేర్ ఆస్పత్రి నుంచి ప్రత్యూషను హైకోర్టుకు తరలించారు. ప్రత్యూషను న్యాయస్థానం ఎదుట పోలీసులు హాజరుపరిచారు.

ఈ సందర్భంగా ప్రత్యూషతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి 25 నిమిషాల పాటు మాట్లాడారు. ప్రత్యూషకు అండగా ఉంటానన్న సీఎం కేసీఆర్‌ను ప్రధాన న్యాయమూర్తి అభినందించారు. ప్రత్యూషను సీఎం కేసీఆర్ నివాసానికి తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. అనంతరం ప్రత్యూషను సీఎం తన అధికారిక నివాసానికి తీసుకెళ్లారు.తీసుకెళ్లి ఇదిగో ఇలా అతిది మర్యాదలు చేసి

తన మర్యాదలు ఎలా ఉంటాయో  చూపించే ప్రయత్నం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -