Thursday, April 25, 2024
- Advertisement -

ఒక్క చెట్టుకు 121 రకాల మామిడి కాయలు.. ఎలా సాధ్యమైందంటే..!

- Advertisement -

మనదేశంలో మామిడి చెట్లకు, మామిడి పండ్లకు ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకం.. ఇలా దేశవ్యాప్తంగా కొన్ని వందల రకాల మామిడి చెట్లు కనిపిస్తుంటాయి. సాధారణంగా ఒక్క చెట్టుకు ఒక రకమే పండ్లే కాస్తాయి. ఒకవేళ అంటు కడితే రెండు లేదా మూడు రకాలు కాయొచ్చు. కానీ యూపీలోని ఓ చెట్టుకు ఏకంగా 121 రకాల పండ్లు కాశాయి.

వ్యవసాయాధికారులు ప్రయోగాత్మకంగా అంటు కట్టే ప్రక్రియ చేపట్టి.. ఇలా ఒక్క చెట్టుకే 121 రకాల మామాడి పండ్లు కాసేలా చేశారు. ఇది ఓ అరుదైన రికార్డని వ్యవసాయశాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఉత్తర ప్రదేశ్ లోని సహరాన్ పూర్ కు చెందిన హార్టికల్చర్ ఉద్యోగులు మాత్రం కొత్తతరహా ప్రయోగం చేశారు.

Also Read: ఈ కాకరకాయ వేపుడు తింటే లొట్టలేయాల్సిందే!

పదేళ్ల వయస్సు ఉన్న ఓ మామిడి చెట్టును ఎంపిక చేసుకొని దానికి అంటుకట్టడం ప్రారంభించారు. ఇలా 121 రకాల మొక్కలను దానికి అంటుకట్టారు. పదేళ్ల తర్వాత అంటే ప్రస్తుతం ఆ చెట్టు 121 రకాల మామిడి పండ్లను అందిస్తుంది. ఇదో అరుదైన రికార్డని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిపై మరిన్ని పరిశోధనలు సాగాల్సి ఉందని వారు అంటున్నారు.

Also Read: పనస గింజలతో రోగనిరోధకశక్తి నిజంగా పెరుగుతుందా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -