Monday, May 5, 2025
- Advertisement -

ప‌వ‌న్ అడ‌గ‌డం… బాబు ఊఊ అన‌డం… అదిరింద‌య్యా ….

- Advertisement -

పోల‌వ‌రం ప్రాజెక్టు నాట‌కాన్ని ప‌వ‌న్‌, చంద్ర‌బాబు ఇద్ద‌రూ ర‌స‌వ‌త్త‌రంగా ర‌క్తిక‌ట్టిస్తున్నారు. ప‌వ‌న్ ఉత్త‌రాంధ్ర ప‌ర్య‌ట‌న టూర్‌లో పోల‌వ‌రం ప్రాజెక్టు సంద‌ర్శించే పార్ట్‌లేదు. వైసీపీ నేత‌లు పోవ‌ల‌రాన్ని సంద‌ర్శిస్తే ఎక్క‌డ స‌మ‌స్య‌లు వ‌స్తాయోన‌ని బాబు ఆదేశాల‌తో ప‌వ‌న్ పోల‌వ‌రాన్ని సంద‌ర్శించారు. క‌ర్ర విర‌గొద్దు, పాము చావ‌ద్దు అన్ని విధంగా మాట్లాడారు. అంటే నువ్వు డ్రామా డైలాగ్‌లు చెప్పు నేను….హ‌రి క‌థ డైలాగులు చెప్తా ఇది బాబు, ప‌వ‌న్ ముసుగులో చేస్తున్న డ్రామా.

పోల‌వ‌రాన్ని సంద‌ర్శించిన త‌ర్వాత ప‌వ‌న్ అబ్బో ఏదో పోల‌వ‌రాన్ని తానేదో ఉద్ద‌రిస్తున్న‌ట్లు చ‌క్క‌గా మాట్లాడారు. ప్రాజెక్టు విష‌యంలో నాకు అనుమానాలు ఉన్నాయ్‌… అస‌లు బాబు త‌ప్పు చేకుంటే లెక్క‌లు చూపించే దానికి ఎందుకు భ‌య‌ప‌డుతున్నాడో నాకు అర్థం కావ‌టంలేద‌న్నారు. పైగా పోల‌వ‌రం లెక్క‌ల‌తో కేంద్రం ద‌గ్గ‌ర‌కు వెల్దామ‌ని మాట్లాడారు. అందులోనూ పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మానం వ్య‌యంపై శ్వేత ప‌త్రాన్ని విడాద‌ల చేయాల‌ని డ్రామా డైలాగ్‌ను బాగానే కొట్టారు.

బాబును ధైర్యంగా ప్ర‌శ్నించ‌కుండా సామే….నా విన్న‌పాన్ని మ‌న్నించి స్వేత‌ప‌త్రాన్ని విడుద‌ల చేయండి సామే అని దీనంగా అడుక్కున్నెట్టు ఉంది. దీనికి తోడు పోలవరపై అఖిలపక్షం కూడా వేయాలని. ఇది చాలా సహేతుకమైన ప్రశ్న అడిగారు. మితృడు అడిగిన ఈ ఒక్క రిక్వస్ట్ ని కూడా బాబు పెడచెవిన పెట్టారు. అయితే అడగకపోతే బాగోదని ఈయన అడిగారు, బాబు గారు తిరస్కరించారు .

పోలవరం మీద శ్వేతపత్రం ఏమీ అవసరం లేదని చెప్పేశారు. ఇక అఖిలపక్షం అనే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు. అయితే ఈ విషయాలపై పవన్ అండ్ కో అంతర్మధనం ఎలా ఉంది అనే దానిపై తీవ్ర చర్చలు నడుస్తున్నాయంట. ఉద్దానం కిడ్నీ బాధితుల స‌మ‌స్య‌మీద‌ర స్పందించిన బాబు పోల‌వ‌రం కాడికి వ‌చ్చ‌టాల‌కు మాత్రం మిత్రునిమాట‌ను ప‌క్క‌న‌బెడ‌తారు.

పవన్ అడిగిన వాటిలో తప్పేముంది, అంతా ట్రాన్స్ పరెంట్ గా ఉంటే శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయకూడదు అని పలువురు అభిప్రాయపడుతున్నారట. ఈ పవన్ సూచనలకు బాబు పాజిటివ్ గా స్పందించి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది. కానీ… ఇలా సున్నితంగా తిరస్కరించడం పవన్ ఫ్యాన్స్ కు కూడా ఏమాత్రం నచ్చలేదంట.

పోలవరంపై మాట్లాడాను అని, ప్రభుత్వాన్ని ప్రశ్నించాను అని పవన్ చెప్పుకోవడానికి మినహా ఒనగూరిన ప్రయోజనం లేదన్నది పలువురి అభిప్రాయం. ఏ ప్రతిపక్షమో చేసినప్పుడు బాబు తిరస్కరిస్తే పర్లేదు కానీ… మితృడు చేసినప్పుడు కూడా ఇలా చేయడం చూస్తే పోల‌వ‌రం నాట‌కాన్ని బాగానే ర‌క్తి క‌ట్టించారు. ముసుగులో గుద్దులాట ఎందుక‌ని ఆదేదో డైరెక్టుగా బాబ‌మీద ఈగ వాల‌నీయ‌ను అని చెప్ప‌చ్చుగాని ప‌వ‌న్ అభిమానులు కూడా అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -