Monday, May 5, 2025
- Advertisement -

వామ్మో… బాబును మించిపోయిన పవర్ స్టార్…. విదేశీ అవార్డ్ వెనుక రహస్యం ఇదా?

- Advertisement -

2014 ఎన్నికల ముందు వరకూ పవన్ కళ్యాణ్ ఏంటి అనే విషయం పక్కన పెడితే 2014 ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న తర్వాత నుంచీ మాత్రం పూర్తిగా రొటీన్, రెగ్యులర్, ఫక్తు మసాలా రాజకీయ నాయకుడిగా మారిపోయాడు. యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ నేతల పంచెలూడగొట్టండి అని నిజాయితీతో కూడిన ఆవేశంతో స్పందించిన పవన్ 2014 తర్వాత నుంచీ మాత్రం ఆవేశాన్ని కూడా తన రాజకీయ వ్యూహాలకు అనుకూలంగా ప్లాన్ చేస్తున్నాడు. ఇక జనాలను నమ్మించడం కోసం విదేశాల్లో పేరు ప్రఖ్యాతుల గురించి భారీగా పబ్లిసిటీ చేసుకునే చంద్రబాబులా పవన్ కూడా మారిపోయాడు. ఆ మధ్య చంద్రబాబు కూడా అమెరికాలో నెంబర్ వన్ యూనివర్సిటీ తనకు అవార్డ్ ప్రకటించిందన్న స్థాయిలో తన డబ్బా తానే కొట్టుకున్నాడు. అమెరికాలో అదొక డబ్బా యూనివర్సిటీ అన్న అసలు విషయాన్ని సోషల్ మీడియా జనాలు బయటపెట్టాక చంద్రబాబు మాటలను సమర్థించడానికి టిడిపి నేతలు, ఆ పార్టీ భజన మీడియా జనాలు నానా పాట్లూ పడ్డారు. ఇప్పుడిక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారు కూడా చంద్రబాబులానే లండన్ అవార్డ్ అని పబ్లిసిటీ చేసుకున్నాడు. అయితే అసలు విషయం మాత్రం అందరినీ ఆశ్ఛర్యపరుస్తోంది.

IEBF అనేది ఇండో యురోపియన్ బిజినెస్ ఫోరమ్ అనే ఇండిపెండెంట్ బాడీ. ప్రభుత్వాలతో ఎలాంటి సంబంధం, అనుబంధం లేని సంస్థ.. పెట్టుబడిదారులను పరిచయం చేసే వేదికలను ఏర్పాటు చేసే సంస్థ అది. మరి పవర్ స్టార్‌కి గ్లోబల్ ఎక్స్‌లెన్స్ అవార్డ్ ఎందుకిచ్చారా అని చూస్తే ఉద్దానంలోని కిడ్నీ బాధితుల సమస్యని కేవలం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చే పోరాటం చేసినందుకట. దశాబ్దాలుగా ఉన్న సమస్య, పాలకులకు బాగా తెలిసిన సమస్యనే. ఇక మీడియా వారు అయితే ఉద్ధానం బాధితుల సమస్య గురించి దశాబ్ధాలుగా రాస్తూనే ఉన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు కూడా కిడ్నీ బాధితులపై వరాల వర్షం కురిపిస్తూ ఓట్లు కొల్లగొడుతూనే ఉన్నారు.

కొత్తగా వచ్చిన పవన్‌కే ఈ సమస్య కొత్తగా కనిపించింది. అందుకే కాస్త హడావిడి చేశాడు. పవన్‌తో ప్రస్తుతానికి జిగిరీ దోస్త్ బంధం ఉంది కాబట్టి టిడిపి మీడియా కూడా ఏదో జరిగిపోతోందని చెప్పి భజన ప్రచారం ఓ రేంజ్‌లో చేసింది. ఈ డ్రామాలో చంద్రబాబు కూడా తనవంతు పాత్ర పోషించాడు. దశాబ్ధాలుగా ఉన్న ఉద్ధానం సమస్యను వంద రోజుల్లో పరిష్కరిస్తాను అన్న స్థాయిలో మాట్లాడేశారు. చంద్రాబాబు ప్రకటన చేసిన వెంటనే……ఆ నెక్ట్స్ సీన్‌లోనే చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పారు పవన్ కళ్యాణ్. అక్కడికేదో ఉద్ధానం సమస్య పరిష్కారం అయిపోయింది అన్నంత స్థాయిలో ప్రచారం చేసుకుని క్యాష్ చేసుకోవడంలో తమ వంతు ప్రయత్నాన్ని విజయవంతంగా చేశారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అండ్ ఎల్లో మీడియా జనాలు. కట్ చేస్తే ఆ వంద రోజులు ఎప్పుడో దాటేశాయి. రోజుల టైం లాక్ చెప్పి పవన్ కళ్యాణ్ కూడా ఏదో చేస్తానన్నాడు. ఇప్పటికి నెలలు గడిచిపోయాయి. సమస్య అలానే ఉంది. కనీస స్థాయిలో కూడా కిడ్నీ బాధితులను ఆదుకున్నది లేదు. కానీ కేవలం అందరికీ తెలిసిన ఉద్ధానం సమస్యను మరోసారి ప్రభుత్వం దృష్టికి తెచ్చినందుకు ఒక అంతర్జాతీయ సంస్థ పవన్‌కి అవార్డ్ ఇచ్చిందని భజన మీడియా జనాలు భజన మొదలెట్టారు. ఇక సోషల్ మీడియాలో పవన్ భక్తులు కూడా రెచ్చిపోతున్నారు. తీరా చూస్తే ఆ సంస్థ స్థాయి ఏంటో తెలిసింది. పవన్‌కి అవార్డ్ ఇచ్చిన కారణం చెప్పాక ముక్కున వేలేసుకోవాల్సి వచ్చింది. కిడ్నీ బాధితుల సమస్యకు అంతర్జాతీయ వేదికలో పరిష్కారాన్ని పవన్ కళ్యాణ్ చూపించినట్టుగా చేస్తున్న హంగామా చూస్తుంటే చిరాకేస్తోంది.

కొత్తగా ఓ నాయకుడు వచ్చాడంటే అవినీతి, అబద్ధాలు, ప్రచార ఆర్భాటాలు కాకుండా కాస్త ప్రజల కోసం నిజాయితీగా పనిచేస్తాడేమో అన్న ఆశ మన సమాజంలో ఉన్న కొంతమందికైనా ఉంటుంది. పవన్ కళ్యాణ్ కూడా ఆ నిజాయితీ నా దగ్గర ఉంది అని చెప్పి తానే స్వయంగా చెప్పుకొన్నాడు. తన భక్తుల స్థాయిలో ఉన్న సినిమా సెలబ్రిటీస్ చేత కూడా ఓ రేంజ్‌లో పొగిడించుకుంటూ చెప్పించుకున్నాడు. వాళ్ళ అవసరాల కొద్దీ బండ్ల గణేష్‌లాంటి వాళ్ళు కాస్త గట్టిగానే పొగిడారు. కానీ పవన్ కూడా ఇలాంటి ఫక్తు పబ్లిసిటీ, అబద్ధపు రాజకీయాలు చేస్తుంటే మాత్రం గుడ్డిగా పవన్‌ని అభిమానించే వారికి కూడా పవన్‌పైన అనుమానాలు రేకెత్తే పరిస్థితి వస్తోంది. ఇలాంటి ఛీప్ పబ్లిసిటీ ట్రిక్స్ మానేసి కాస్త నిజాయితీగా ప్రజా సమస్యలపై పోరాడే ప్రయత్నం చేస్తే బెటరేమో పవన్ కళ్యాణ్?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -