ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబును సమస్యలు చుట్టుముడుతున్నాయి. ప్రజలల్లో వ్యతిరేకత, అవినీతి ఆరోపనలకు ఇప్పుడు ఓటుకు నోటు కేసు బాబు మెడకు ఉచ్చు బిగిస్తోంది. రెండు సవంత్సరాలు ముందుకు కదలని కేసు ఇప్పుడు హటాత్తుగా మరో సారి తెరపైకి రావడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.
40 సంవత్సరాల అనుభవం, ఎప్పుడూ నిప్పు అని చెప్పుకొనే బాబులో ఒక్కసారిగా అలజడి మొదలయ్యింది. తాను నిప్పునని తనపై ఒక్క కేసుకూడా లేదని గంభీరంగా చెప్పుకుంటున్నా వస్తవం బాబుగారికి బోధపడినట్టుంది. బాబుపై ఉన్న కేసులకంటే ఓటుకు నోటు కేసే బాబును ఇబ్బందులకు గురిచేస్తోంది.
అసలు ఈ కేసు సూత్రదారులు ఎవరు అనేది అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో ఉన్న సమస్యలను అదుపుచేయలేకే చంద్రబాబు నానా అవస్తలు పడుతున్నారు. పోయిన ఎన్నికల సమయంలో ఇచ్చిన రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, డ్వాక్రా మహిళల రుణమాఫి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ప్రపంచస్ధాయిలో అద్భుతమైన రాజధాని నిర్మాణం, కాపులను బిసిలోకి చేర్చటం, బోయలను ఎస్టీలో చేర్చటం లాంటి అనేక హామీలు అమలు కాలేదు. వీటికి తోడు పార్టీలో ఉన్న విబేధాలు సరే సరి.
మిగిలిన వాటి సంగతి ఎలాగున్నా ఏ రాష్ట్రంలో అయినా శాంతి భద్రతలు అదుపులో ఉంటే పరిపాలన బాగుందనే అంటారు. కానీ ఏపిలో శాంతి భద్రతల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదన్నట్లు తయారైంది. గతంలో ఎన్నడూ లేనంతగా శాంతి, భద్రతలు క్షీణించాయనే చెప్పాలి.
రాష్ట్రంలో జరిగే నేరాలకు మూలాలు ఎక్కువ భాగం టిడిపి నేతల వద్దే తేలుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. పలువురు నేతలు ప్రత్యక్షంగానో లేకపోతే పరోక్షంగానో సంబంధాలు కలిగి ఉంటున్నారని వైసిపి నేతలు ఎప్పటి నుండో మండిపడుతున్నారు. అందుకనే ఎవరిపైనా పోలీసులు చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఫలితంగా శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పినట్లు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిజమే అనిపిస్తున్నాయ్. ఒక వైపు తరుము కొస్తున్న ఎన్నికలు మరో వైపు ఓటుకు నోటు కేసు వీటన్నింటినుంచి బాబు బయటపడతాడా అనేది సందేహమే.