Thursday, March 28, 2024
- Advertisement -

చడ్డీ గ్యాంగ్.. వీరి కథేంటో తెలుసా

- Advertisement -

చడ్డీ గ్యాంగ్ .గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాను..ఇపుడు తాజాగా హైదరాబాద్ చివరి ప్రాంతాలను భయపెడుతోన్న గ్యాంగ్ . ఈ ఏడాది మొదట్లో వీరి గురించి ఫేస్ బుక్ ,వాట్సాప్ లో కొన్ని పిక్స్ వైరల్ అయ్యాయి. మహారాష్ట్రలో ఇలాంటి గ్యాంగ్ లు కూడా ఉన్నాయా అని అంతా ఆశ్చర్యపోయారు. అయితే ఇప్పుడు ఆ గ్యాంగ్ లు నగరంలో సంచరిస్తూ ఉండడంతో సోలోగా ఇండిపెండెంట్ హౌస్ లలో బతికేవారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.నిజానికి ఈ ముఠా సభ్యులు ఫాసే పార్థి తెగ వారు. ఈ తెగలు మనకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ లలో కనిపిస్తాయి. ఈ తెగవారు గత 18 ఏళ్లుగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మద్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఏపీలలో దోపిడీలకు పాల్పడ్డారు. కానీ ఎక్కడా పోలీసులకు చిక్కకుండా చాకచక్యంగా తప్పించుకు తిరిగారు.

పోలీసుల రికార్డుల ప్రకారం… ముంబై పోలీసులు గత ఏడాది బోరవెల్లిలో కాల్పులు జరిపి ఈ గ్యాంగ్‌ సభ్యులను అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు బెంగళూరు, మహారాష్ట్రల్లో దోపిడీలకు పాల్పడ్డ చడ్డీ గ్యాంగ్‌ తాజాగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో సంచరిస్తున్నట్టు ఆధారాలు లభించాయి. ఈ గ్యాంగ్‌లో ఐదు నుంచి ఆరుగురు సభ్యులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అర్ధరాత్రి ఒంటరిగా వెళ్లేవారు, ఇండిపెండెంట్ ఇళ్లే ఈ గ్యాంగ్ మెయిన్ టార్గెట్. సిసి టీవీ ఫుటేజీలను పరిశీలించేటప్పుడు ఈ గ్యాంగ్ సభ్యులు ఆయుధాలతో సంచరించడం కనిపించింది. ఈ గ్యాంగ్‌ సభ్యులు చెడ్డీలు, బనియన్లు ధరించి ఫేస్ కు మాస్క్ వేసుకుని దోపిడీలకు పాల్పడుతుంటారు. మరీ ముఖ్యంగా నిర్మానుషమైన కాలనీలలో తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి దోపిడీ చేస్తారు.

చెడ్డీ గ్యాంగ్‌ కు మరో పేరు కూడా ఉంది. అదే కచ్చా బనియన్ గ్యాంగ్. వారు తమ శరీరానికి ఒండ్రు మట్టి లేదా నూనె రాసుకుని సంచరిస్తారు. పగలు కుర్తా మరియు లుంగీలు ధరించి రెక్కీ నిర్వహిస్తారు. రైల్వే స్టేషన్‌, బస్‌ స్టాండ్‌.. కాలనీలలో ఉన్న ఖాళీ ప్రదేశాలలో బస చేస్తుంటారు. పగలు బిచ్చగాళ్లగా.. కూలీల మాదిరి నటిస్తూ కాలనీలలో తిరుగుతారు. తాళం వేసి ఉన్నఇళ్లను గుర్తించి అర్థరాత్రి దోపిడీ చేస్తారు. ఈ ముఠా రెండుమూడు ఇళ్లలో ఒకేసారి చోరీ చేయగల నేర్పరులు. దొంగతనం చేసే సమయంలో ఇంటి సభ్యులు ఉంటే వారిని కట్టేస్తారు.. ఒకవేళ ఎదురుతిరిగితే చంపడానికి కూడా వెనుకాడరు. ఈ గ్యాంగ్‌ కొన్ని సార్లు దోపిడీ చేసిన ఇంట్లోనే భోజనం చేసి అక్కడే మలమూత్ర విసర్జన చేసి జుగుప్సాకరంగా మార్చుతారు.

వారిని పట్టుకోవడం ఎలా అంటే..
కాలనీలలోని అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్లకు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న దృశ్యాలను చూపించి పోలీసులకు అవగాహన కల్పించాలి. తమ తమ పరిసర ప్రాంతాల్లో అనుమానంగా తిరుగుతున్న వారి గురించి సమాచారం అందించాలని ప్రజలకు చెప్పాలి. స్థానిక యువకులతో కలిపి గస్తీ బృందాలను ఏర్పాటు చేసుకునే దిశగా ప్రోత్సహించాలి. అన్నీ ఏరియాల్లో సీసీటీవీలతో భద్రత పెంచుకునే దిశగా ప్రజలకు అవగహన కల్పించాలి.ఒకవేల ఆ తరహా వ్యక్తుల జాడ తెలిస్తే వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ కు తెలియజేయాలి. స్మార్ట్ ఫోన్లు ఉంటే వెంటనే మీ లొకేషన్ ను కంట్రోల్ రూమ్ కు పంపాలి.లోకల్ పోలీస్ స్టేషన్ లోకి సమాచారం అందించకుండా మనంతట మనం డైరెక్ట్ గా ఎలాంటి సాహోసపేత చర్యలు తీసుకోకూడదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -