జగన్ పార్టీని స్థాపించి ఆరు సంవత్సరాలు అయినా జగన్‌లో రాజకీయ పరినితి ఇంకా పూర్తి స్థాయిలో కనిపించడంలేదనె వాదనలు అన్ని వర్గాల ప్రజలనుంచి వినిపిస్తున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి లక్షణాలు పుణికి పుచ్చున్కనారన్నారని ప్రజలు అంటుంటారు. ఇలాంటి సంయంలోనె వైఎస్‌తో జగన్‌ను పోలుస్తుంటారు.
వైయస్ రాజశేఖర రెడ్డి వద్ద ఉన్న ఓపిక, రాజకీయ నైపుణ్యం, నమ్మకం, ఆత్మవిశ్వాసం జగన్ వద్ద లేవని అంటున్నారు. జగన్‌కు ఉన్న ఆవేశం, అతివిశ్వాసం వంటి అంశాలే ఆయనను దెబ్బతీస్తున్నాయని అన్ని వర్గాలనుంచి విమర్శలు వస్తున్నాయి.
వైయస్ రాజశేఖర రెడ్డి ఎవరినైనా నమ్మితే వారి కోసం ఏదైనా చేసేందుకు వెనుకాడరు. ఎవరినైతె నమ్ముతారొ వారి మీద పూర్తి విశ్వాసంతో ఉంటారు. స్థానిక నాయకులు చెప్పింది కూడా విని అవగాహనతొ ముందుకెల్లేవారు. కానీ జగన్ మాత్రం ప్రతి విషయంలో అతివిశ్వాసంతో ముందుకెళ్తున్నారని అంటున్నారు. జగన్ ఇతరుల మాటలు వినరు అనే వాదనలు పలుమార్లు వినవచ్చాయి. ఆయన చెప్పిందే వేదం అన్నట్లుగా ఉంటారనే విమర్శలు ఉన్నాయి.
రాజశేఖర్‌రెడ్డికి నమ్మిన మితృలుగా ఉన్న వారందరిని జగన్ దూరం చేసుకుంటున్నారు. నేను చెప్పిందే వినాలనే ధోరని జగన్ దగ్గర ఉండటం వల్లే ముఖ్యనేతలను దూరం చేసిందంటున్నారు. ప్రత్యేక హోదా విషయంలోను కమలం పార్టీపై విమర్శలు చేయకుండా చంద్రబాబును తప్పుపడతారు. చంద్రబాబుపై పదేపదే విమర్శలు ఆయనకు మైనస్ అవుతున్నాయనేది బహిరంగ రహస్యం.
వైయస్ రాజశేఖర రెడ్డి సీఎం పీఠంపై కూర్చునేందుకు రెండున్నర దశాబ్దాల పాటు నిరీక్షించారు. పార్టీలో ఉన్న అసమ్మతిని అధిగమించి సీఎం అయ్యారు. కానీ జగన్ మాత్రం పార్టీ పెట్టినప్పటి నుంచే సీఎం పీఠంపై కన్నేశారు. పార్టీ పెట్టకముందు వైయస్ చనిపోయినప్పుడే సంతకాలు చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడికి వెల్లినా నేనె సీఎం అవుతాననె మాటలు ప్రజలకుకూడా విసుగు తెప్పిస్తున్నాయి. దీంతో ప్రజలుకూడా జగన్‌కు సీఎం పదవిపై ఆశతప్ప వేరేదిలేదనె భావన పెరిగిపోతోంది. వైఎస్‌లో ఉన్న రాజకీయ చతురత జగన్‌లో లేవనేది స్పష్టం అవుతోంది. భవిష్యత్తులో ఏం జరుగుతోందో చూడాలి.