Saturday, May 3, 2025
- Advertisement -

స్వీట్ ప్రాణాలను చంపుకు తింటోంది

- Advertisement -

డ్రింక్స్ తో ఏడాదికి 1.84లక్షల మంది మృత్యు ఒడిలోకి

స్వీట్ డ్రింక్స్ తో ఇంతటి ముప్పు ఉందని తెలిస్తే… మనం స్వీట్ సోడాలు,ఎనర్జీ డ్రింక్ లు,స్వీట్ ఫ్లేవర్ తో వచ్చే కోల్ట్ కాఫీలు తాగమేమో. ఏకంగా ఏడాదికి ఒక లక్షా ఎనభై నాలుగువేల మంది స్వీట్ డ్రింక్స్ దాటికి కుప్పకూలుతున్నారని ఓ యూనివర్శీటీ తన తాజా సర్వేలో తేల్చేసింది.ఈమధ్యకాలంలో చాలా దేశాల్లో చక్కెర సంబందింత వ్యాధులతో చనిపోవడాలు ఎక్కువైపోయాయి.మన దైనందిన జీవితంలో మనం తీసుకునే స్వీట్ రిలేటెడ్ డ్రింక్స్ అన్నింటి ద్వారా ఏదో ఒక రకంగా మన ప్రాణాలకు ….. మనమే ముప్పు తెచ్చుకుంటున్నామని శాస్త్రవేత్తలు తేల్చారు. నిపుణులు 51 దేశాల్లో తేల్చిన లెక్కల ప్రకారం…

ప్రతి ఏడాది చనిపోతున్న 1.84లక్షల మందిలో  సుగర్ రిలేటెడ్ డ్రింక్స్ వలనే…. ఏకంగా ఒక లక్షా ముప్పై వేల మంది చనిపోతున్నారట.ఆ తరువాత గుండె సంబందింత వ్యాదులతో 45వేల మంది,క్యాన్సర్ తో 6,450 మంది మరణిస్తున్నారని తేలింది. ఈ విషయంలో మెచ్చుకోవల్సిన దేశం సుగర్ దగ్గరకి రానీయకుండా…. కంట్రోల్ చేసిన దేశం జపాన్ అయితే… బాధ పడాల్సిన దేశం మెక్సికో. ఎందుకంటే జపాన్ లో  కేవలం ఒక్క శాతం మాత్రమే సుగర్ సంబందింత వ్యాదులతో చనిపోతే…. మెక్సికోలో ఏకంగా 30శాతం మంది సుగర్ రిలేటెడ్ బేవరేజెస్ తీసుకుని మృత్యు ఒడిలోకి వెళ్లిపోతున్నారు.
మెక్సికోలో 24వేల మరణాలలో 405 మంది…. యుఎస్ లో 25వేల మరణాలలో  125మంది కేవలం స్వీట్ సంబందిత డ్రింక్స్ ,ఫుడ్ తీసుకోవడం వలన మరణించినట్లు తాజా అధ్యయనంలో తేలింది.
దిగువ,మధ్య తరగతి దేశాల్లో దాదాపు 76% జనాభా చక్కెర సంబందింత ఆహార పానీయాలతో చనిపోతూ ఉండం ప్రపంచ ఆరోగ్య సమస్యకు పేద్ద సవాల్ గా మారింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -