Sunday, May 4, 2025
- Advertisement -

రామ్ చరణ్ అన్ని కోట్లు పెడతాడా?!

- Advertisement -

తమిళంలో సూపర్ హిట్ అయిన తనీ ఒరువన్ సినిమాపై తెలుగు హీరోలు కన్నేసిన విషయం తెలిసిందే.

ఏకంగా స్టార్ హీరోలే ఈ సినిమాపై కన్నేశారు. మహేశ్ బాబు, రామ్ చరణ్ స్థాయిలో ఈ సినిమా రైట్స్ ను సొంతం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతానికి మహేశ్ ఈ సినిమా గురించి ఆలోచించడం ఆపేశాడు. అయితే రామ్ చరణ్ మాత్రం ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు కంకణం కట్టుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమ ఆరైట్స్ విషయంలో పెద్ద పెద్ద నంబర్లు వినిపిస్తుండటమే ఇక్కడ విశేషం!

ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ను ఏకంగా తొమ్మిది కోట్ల రూపాయలు చెబుతున్నారట తమిళ నిర్మాతలు. తమిళంలో భారీ హిట్ అయ్యింది కాబట్టి.. తెలుగులో  ఈ రీమేక్ పట్ల చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు కాబట్టి… ఈ సినిమా రేట్లు అమాంతం పెరిగిపోయినట్టుగా తెలుస్తోంది. తొమ్మిది కోట్ల రూపాయల ధరను బేరమాడితే దాదాపు ఆరు కోట్ల రూపాయల స్థాయికి తీసుకొచ్చారట. మరి రీమేక్ రైట్స్ కోసం ఆరు కోట్ల రూపాయలు వెచ్చించినా అది భారీ స్థాయి ఖర్చే అవుతుంది. మరి చరణ్ సినిమా కాబట్టి ఆ మాత్రం పెట్టడం పెద్ద భారం కాకపోవచ్చు.

అయితే తమిళ నిర్మాతలు మరిన్ని కండీషన్లు పెడుతున్నట్టుగా తెలుస్తోంది. తమిళంలో ఈ సినిమాకు దర్శకత్వం వహించిన జయం రాజానే తెలుగులో కూడా దర్శకత్వం వహిచాలని అంటున్నాడట. ఆ షరతుకు ఒప్పుకొంటేనే ఈ సినమా రైట్స్ ను ఇస్తామని అంటున్నారట. మరి ఇవన్నీ చూస్తుంటే తమిళ నిర్మాతల అతి  కొంచెం ఎక్కువయినట్టుగానే ఉంది. వీటి మధ్య ఈ రీమేక్ ప్రాజెక్టు ఎక్కడకు తేలుతుందో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -