అదేమంటే.. పాలనలో పారద్శకత అని అంటారు. హైటెక్ పాలన అని చెప్పుకొంటారు.
అందుకే కోట్ల రూపాయలు పెట్టి ప్రభుత్వ ఉద్యోగులకు ట్యాబ్ లు, ల్యాప్ టాప్ లు ఇస్తున్నట్టుగా ప్రచారం చేసుకొంటున్నారు.
బాబు ముఖ్యమంత్రి అయ్యాకా ఈ తీరు మరింత ఎక్కువగా అయ్యింది. ఏపీలో పనిచేసే ప్రతి ప్రభుత్వ అధికారికీ కూడా ప్రభుత్వ ఖర్చుతో ట్యాబ్ లు ఇవ్వనున్నామని మరోసారి మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రకటించాడు. అలాగే ల్యాప్ టాప్ లు కూడా ఇవ్వనున్నామని ఆయన అంటున్నారు.
మరి దీని కోసం కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారని వేరే చెప్పనక్కర్లేదు. అసలు ఈ విషయంలో వచ్చే విమర్శలను ఏపీ ప్రభుత్వం ఏ మాత్రం లెక్క చేయడం లేదు కూడా. అసలే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని అంటున్నారు అలాంటప్పుడు ఈ దుబారా ఖర్చు ఎందుకు? అని ప్రశ్నించినా కూడా ఏపీ ప్రభుత్వంలో చలనం లేదు. అయితే తాజాగా టీచర్లకు కూడా ల్యాప్ టాప్ ఇవ్వాలనే నిర్ణయం మాత్రం విడ్డూరంగా ఉంది.
ఒకవైపు స్కూళ్లలో పిల్లలకు టాయ్ లెట్ రూమ్ ల సౌకర్యం సరిగా ఉండదు. కొన్ని వేల ప్రభుత్వ పాఠశాలల్లో అసలు ఇలాంటి ఏర్పాట్లే లేవు. యుక్తవయసు అమ్మాయిలు చదివుకొనే హై స్కూళ్లలో కూడా ఇదే దుర్భర పరిస్థితే ఉంది. మరి దానిలో మార్పు తీసుకురావాల్సి ఉంది. అనునిత్యం మీడియా కూడా ఈ విషయం కూడా ప్రస్తావిస్తోంది. కానీ ఈ సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి నిధులు ఇవ్వని ప్రభుత్వం.. టీచర్ల చేతికి ల్యాప్ టాప్ లు, ట్యాబ్లెట్లు ఇవ్వడానికి మాత్రం కోట్ల రూపాయలు వెచ్చించడానికి సిద్ధం అవుతోంది. మరి ఇదేనా హైటెక్ పాలన అంటే..?